పీపీఈ కిట్ ఇప్పుడు ఇదే కొత్త ఫ్యాషన్..
శ్రావణ మాసం అంటేనే పండుగల నెల.. ప్రతీ రోజు ఓ పండుగ రోజే అని తెలుగింటి ఆడపడుచులు పాట పాడుకుంటున్నారు. అయితే పండుగ అంటే పట్టు చీరలు, సింగారాలు ఇవి లేకుండా పాత చీర పనికి రాదంటున్నారు...

శ్రావణ మాసం అంటేనే పండుగల నెల.. ప్రతీ రోజు ఓ పండుగ రోజే అని తెలుగింటి ఆడపడుచులు పాట పాడుకుంటున్నారు. అయితే పండుగ అంటే పట్టు చీరలు, సింగారాలు ఇవి లేకుండా పాత చీర పనికి రాదంటున్నారు. ఇలా కాదు అని షాపింగ్ మాల్స్ లో షాపింగ్ చేసే ధైర్యం చేయడం లేదు. కరోనా మాత్రం ఇంటి గడప దాటితే చూస్తూ ఊర్కోనంటోంది. దీంతో చేసేది లేక ఇంట్లోనే అన్ని పండుగలను జరుపుకునేందుకు ఓకే చెప్పారు.
అయితే పట్టు చీరలకు కొంత కాలం పక్కన పెట్టి మా షాప్ లో ఉన్న ఈ డిజైనల్లు చూడాలంటున్నారు నిజామాబాద్ లోని కొందరు వస్త్ర వ్యాపారులు. వైరస్ బారిన పడకుండా తమను తాము కాపాడుకోవడానికి పీపీఈ కిట్ అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఓ బట్టల దుకాణం ముందు ఓ బొమ్మకు పీపీఈ కిట్‌ను అలంకరించి విక్రయానికి పెట్టారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మహిళామణులు మాత్రం మరోలా అనుకుంటున్నారు. ఇవి కూడా మ్యాచింగ్ , డిజైన్లలో వస్తే ఎంత బాగుండో అని మనసులో మాటను షాపు ఓనర్లతో అంటున్నారట.