Naga Chaitanya ‘Thank You’ Movie: మరోసారి లైలాతో డ్యూయెట్‌కు రెడీ అవుతున్నారు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య. వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న చైతూ.. లైనప్ విషయంలోనూ అదే జోరు చూపిస్తున్నారు. లాక్ డౌన్ తరువాత ‘లవ్ స్టోరి’ షూటింగ్ కంప్లీట్ చేసిన చైతన్య ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ‘థ్యాంక్యూ’ సినిమాను మొదలు పెట్టారు.
విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చైతూ సరసన ఇద్దరు టాలెంటెడ్ భామలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. లీడ్ హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకునే ఆలోచనలో ఉన్నారట విక్రమ్. గతంలో ‘ఒక లైలా కోసం’ సినిమాలో చైతూతో జోడి కట్టారు పూజ. అయితే అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి.
‘ఒక లైలా కోసం’ సినిమా టైంలో పూజ అప్‌కమింగ్ హీరోయిన్.. కానీ ఇప్పుడు ఆమె రేంజే వేరు. పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు పూజ. ఈటైంలో చైతూ సినిమాకు డేట్స్ ఇవ్వగలరా..? ఈ డౌట్ కూడా ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో నటిస్తున్న ఈ భామ.. వెంటనే అతని అన్నతో జోడి రెడీ అంటారా..? ఇలా చాలా క్వశ్చన్స్ రెయిజ్ చేస్తున్నారు ఫిలిం నగర్ జనాలు.
Also Read:
Jagananna Amma Vodi: ఎన్నికల కోడ్ ఉన్నా ‘అమ్మఒడి’ పథకం యథాతథం.. స్పష్టం చేసిన విద్యాశాఖ మంత్రి