AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసలు ఈ తెలంగాణ మంత్రులకేమైంది..?

వాళ్లంతా మంత్రులు.. రాష్ట్రంలో ఎక్కడైన పర్యటించేయోచ్చు. కాదు కాదు.. పర్యటించడం వారి బాధ్యత. అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే. వారికి కేటియించిన శాఖల పనితీరును సమీక్షించాల్సి ఉంటుంది. కానీ ఈ పని ఎక్కడా కూడా జరగడం లేదు. వారంతా వారి సొంత పనులకు మాత్రమే పరిమితమవుతున్నారు. కనీసం పక్క సీటు వైపు కూడా కన్నెత్తి చూడడం లేదు. అసలు వీరికేమైంది. ఎందుకు ఇలా చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదీరింది. మొదట్లో […]

అసలు ఈ  తెలంగాణ మంత్రులకేమైంది..?
Nagarjuna Sagar By-Poll 2021
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 30, 2019 | 10:09 PM

Share

వాళ్లంతా మంత్రులు.. రాష్ట్రంలో ఎక్కడైన పర్యటించేయోచ్చు. కాదు కాదు.. పర్యటించడం వారి బాధ్యత. అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే. వారికి కేటియించిన శాఖల పనితీరును సమీక్షించాల్సి ఉంటుంది. కానీ ఈ పని ఎక్కడా కూడా జరగడం లేదు. వారంతా వారి సొంత పనులకు మాత్రమే పరిమితమవుతున్నారు. కనీసం పక్క సీటు వైపు కూడా కన్నెత్తి చూడడం లేదు. అసలు వీరికేమైంది. ఎందుకు ఇలా చేస్తున్నారు.

ప్రభుత్వం ఏర్పడిన చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదీరింది. మొదట్లో మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో.. అంతా వేయికళ్లతో వేచిచూశారు. ఎవర్ని ఈ పదవులు వరిస్తాయో అని. అయితే ఇటీవల పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణలో అన్ని శాఖలకు మంత్రులు వచ్చారు. తమ శాఖలకు సంబంధించిన పనులు చూడాల్సిన బాధ్యత వీరిపై ఉంది. అంతేకాదు తమ వీరు రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే అవకాశం ఉంది. ఏ నియోజకవర్గానికైనా వెళ్లి పర్యటించే అధికారం ఉంది. అయితే కొందరు మంత్రులు మాత్రం వారి సొంత నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. అంతేకాదు అసలు ఈ మంత్రులకు ఏమైంది.. అన్ని జిల్లాల్లో ఎందుకు పర్యటించడం లేదు.. ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే చర్చ కూడా జరుగుతోంది.

అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరు వల్లే కొందరు మంత్రులు ఇతర నియోజకవర్గాలకు వెళ్లడం లేదని తెలుస్తోంది. మొన్నీమధ్య ఉమ్మడి పాలమూరుకు చెందిన ఓ మంత్రి.. పక్కనే ఉన్న నియోజకవర్గానికి తరుచూ వెళుతుంటే.. మంత్రి రాకను జీర్ణించుకోని ఆ ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారట. తన కోపాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు గన్‌మెన్లను వెనక్కికి పంపించారట. అంతేకాకుండా పార్టీ నేతలకు అందుబాటులోకి రాకుండా అలకబూనారట. దీంతో ఆ జిల్లా మంత్రి అటు వైపు వెళ్లడం మానేశారని తెలుస్తోంది.

ఇక హైదరాబాద్‌కు చెందిన మంత్రుల పరిస్థితి కూడా సేమ్ టూ సేమ్. ముఖ్యంగా మేడ్చల్ జిల్లాకు చెందిన మంత్రి తన కొడుకు, అల్లుడు భవిష్యత్ కోసం సిటీ లోని నియోజకవర్గాల్లో జోరుగా టూర్లు వేస్తున్నారట. దీంతో స్థానిక ఎమ్మెల్యేలు మంత్రిగారి పర్యటనలకు బ్రేక్‌లు వేశారట. దీంతో చేసేదేంలేక.. ఆ మంత్రి తన సొంత నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఇక సికింద్రాబాద్ మంత్రిగా పేరుపొందిన నేత కూడా వేరే జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారట. కానీ సిటీలో మాత్రం వేరే నియోజకవర్గాలపై పెద్దగా చూడడం లేదు. ఇందుకు కారణం.. మాజీ మంత్రి, మేయర్‌తో వచ్చిన గ్యాప్‌ వల్లే అని ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ మంత్రి పరిస్థితి కూడా సేమ్ ఇలాగే ఉంది. తన జిల్లా తన నియోజకవర్గం తప్ప ఎటూ వెళ్లడంలేదంటా. ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మినహా మిగతా మంత్రులు ఎవ్వరు కూడా వేరే జిల్లాలో అడుగుపెట్టాడానికి సాహసం చెయ్యడం లేదట.

అయితే సాధారణంగా మంత్రి హోదాలో రాష్ట్రంలో ఎక్కడ అయిన పర్యటించే అధికారాలు మంత్రులకు ఉంటాయి. కానీ ఎమ్మెల్యేల నుండి సహకారం లేకపోవడం..తామ టూర్లతో వారు అసంతృప్తికి గురికావడం ఎందుకులే అని కొందరు మంత్రులు వారి నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారట.

Follow Us
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..