తాడిపత్రిని వీడని హై టెన్షన్..జేసీ దివాకర్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి పరిసరాల్లో పోలీసుల పహారా

| Edited By: Pardhasaradhi Peri

Dec 26, 2020 | 7:11 PM

ప్రస్తుతం తాడిపత్రి పూర్తిగా పోలీస్ కంట్రోల్‌లో ఉంది. జేసీ దివాకర్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి పరిసరాలను తమ ఆధీనంలో తీసుకున్నారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు...

తాడిపత్రిని వీడని హై టెన్షన్..జేసీ దివాకర్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి పరిసరాల్లో పోలీసుల పహారా
Follow us on

Tadipatri Tension : తాటిపత్రిలో పరిస్థితి కూల్‌గా ఉన్నా…జిల్లాలో మాత్రం టెన్షన్ వాతావరణే కనిపిస్తోంది. ప్రత్యర్ధులిద్దరు ఎవరికి వారు సైలెంట్‌గా ఉన్నప్పటికి ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. కేతిరెడ్డి వర్గీయులు జేసీ ఇంటికి వెళ్లడాన్ని టీడీపీ తప్పుపట్టింది. మరోవైపు జేసీ, అస్మిత్‌రెడ్డితోపాటు నలుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై మాత్రం తానూ ఫిర్యాదు చేయబోనని జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించడం వల్లే తాడిపత్రి ఇలాంటి పరిస్థితి నెలకొంది.

పరిస్థితులపై సామరస్యంగా చర్చించేందుకు జేసీ ఇంటికి వెళ్తే టీడీపీ నేతలు నానా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు అనంతపురం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇంటికి వెళ్లడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలకు గతంలో జేసీ దివాకర్‌రెడ్డి పోలీస్ స్టేషన్ కు వెళ్లి గేటుకు తాళం వేసినప్పుడు, ప్రభోదానంద ఆశ్రమంపై రాళ్లు విసిరినప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. దాడిలో తమ పార్టీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి కాబట్టే పోలీస్ కేసు పెట్టారని..టీడీపీ వాళ్లకు ఎవరికైనా గాయపడితే పోలీస్ కేసు పెట్టవచ్చని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సూచించారు .

ప్రస్తుతం తాడిపత్రి పూర్తిగా పోలీస్ కంట్రోల్‌లో ఉంది. జేసీ దివాకర్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పహారా కాస్తున్నారు.