Hyderabad: ఇన్‌స్పెక్టర్‌ నిర్వాకం.. నిందితుల డెబిట్ కార్డు నుంచి లక్షలు దోచేసి.. ఆఖరుకు

|

May 11, 2022 | 7:46 AM

ఏ దొంగతనం జరిగినా, ఏ దోపిడీ జరిగినా ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే నిందితులను పట్టుకుని వారి నుంచి మన వస్తువులను ఇచ్చే విధిని వారు నిర్వర్తిస్తుంటారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పిస్తూ అండగా ఉంటారు. అయితే ఓ...

Hyderabad: ఇన్‌స్పెక్టర్‌ నిర్వాకం.. నిందితుల డెబిట్ కార్డు నుంచి లక్షలు దోచేసి.. ఆఖరుకు
Pahadi Sharif
Follow us on

ఏ దొంగతనం జరిగినా, ఏ దోపిడీ జరిగినా ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే నిందితులను పట్టుకుని వారి నుంచి మన వస్తువులను ఇచ్చే విధిని వారు నిర్వర్తిస్తుంటారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పిస్తూ అండగా ఉంటారు. అయితే ఓ పోలీస్ మాత్రం.. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఓ కేసులో అరెస్టైన వారి నుంచి డెబిట్ కార్డు సేకరించి రూ.లక్షలు కొల్లగొట్టాడు. నిందితుడు జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాక అసలు విషయం తెలుసుకుని కంగు తిన్నాడు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. రాచకొండ(Rachakonda) పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మేవాత్‌ ముఠాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో టైర్లు రవాణా చేస్తున్న కంటైనర్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో బాధితులు పహాడీషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే నెల22న నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొన్న సమయంలో వారి వద్ద ఉన్న వస్తువులను పోలీసులు తీసుకున్నారు. ఇంతటితో ఆగకుండా ఇన్‌స్పెక్టర్‌ దొంగిలించిన టైర్లను కొనుగోలు చేసిన సెల్‌ఫోన్లు, బ్యాంకు డెబిట్‌ కార్డులు, పిన్‌ నంబర్లు సేకరించాడు.

రిసీవర్‌ నుంచి తీసుకున్న డెబిట్‌ కార్డు, పిన్‌ నంబర్‌ వివరాలను కొరియర్‌ ద్వారా తిరుపతిలోని స్నేహితురాలికి పంపాడు. అక్కడి ఏటీఏం కేంద్రాల్లో విడతల వారీగా ఆమె రూ.5లక్షలకు పైగా నగదు తీసుకుంది. నిందితుడు జ్యుడీషియల్‌ రిమాండ్‌ ముగించుకుని బయటకు వచ్చాక విషయం తెలుసుకుని బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులే తన డబ్బును తీసుకున్నారనే అనుమానంతో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో రాచకొండ సీపీ స్పందించి.. అంతర్గత విచారణకు ఆదేశించారు.

ఈ దర్యాప్తులో ఆ డెబిట్ కార్డుతో తిరుపతిలో లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. సీసీ ఫుటేజ్‌, బ్యాంకు లావాదేవీల ఆధారంగా ఇన్ స్పెక్టర్ స్నేహితురాలిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తులో ఆమె నగదు తీసుకున్నట్లు ఒప్పుకుంది. ఈ ఘటనపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించి.. పోలీసు అధికారిపై విచారణ జరిపుతామని వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Sambar: సాంబార్ రుచిగా ఉండాలంటే ఏం చేయాలి.. ఇంట్లో ఇలా తయారు చేసి చూడండి..!

IPL 2022: గుజరాత్‌ టైటాన్స్‌ నెంబర్‌వన్‌.. ప్లే ఆఫ్‌లో చేరిన మొదటి జట్టు..