Bindori: ఘనంగా పోలీస్ వధువు బిందోరీ వేడుక.. సాటి పోలీసులే కుటుంబ సభ్యులు.. పోలీస్ స్టేషనే వేదిక!

రోనా కారణంగా అందరూ ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు ప్రభుత్వ రంగంలో ఉన్నవారూ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ కరోనా రెండో వేవ్ పోలీసులపై విపరీతమైన ఒత్తిడి పెంచింది.

Bindori: ఘనంగా పోలీస్ వధువు బిందోరీ వేడుక.. సాటి పోలీసులే కుటుంబ సభ్యులు.. పోలీస్ స్టేషనే వేదిక!
Bindori Celebrations

Updated on: Apr 26, 2021 | 11:01 PM

Bindori: కరోనా కారణంగా అందరూ ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు ప్రభుత్వ రంగంలో ఉన్నవారూ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ కరోనా రెండో వేవ్ పోలీసులపై విపరీతమైన ఒత్తిడి పెంచింది. ఇదిలా ఉంటె చాలా చోట్ల పెళ్ళిళ్ళు ఆగిపోయాయి. పోలీసు డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారి పెళ్ళిళ్ళ వేడుకలు పోలీస్ స్టేషన్లు వేదికగా జరుగుతున్నాయి. ఇటీవల ఒక మహిళా కానిస్టేబుల్ పసుపు వేడుక రాజస్థాన్ లోని దుంగాల్ పూర్ స్టేషన్ లో జరిపించారు. ఇప్పుడు అలాంటిదే మరో పోలీసు వివాహ వేడుకలు స్టేషన్ లో జరిపించిన విషయం వైరల్ అవుతోంది.
రాజస్థాన్‌లోని బుహానా పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది ఆదివారం అదే పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ సోనియా అనే వధువు కోసం బిందోరి వేడుకను ఘనంగా నిర్వహించారు. ‘బిందోరి’ అనేది వధువుకు వివాహానికి పూర్వం జరిగే వేడుక, ఇందులో వధువు, కొత్త బట్టలు, ఆభరణాలు ధరించి, ఒక బాగీ లేదా రధంలో కూర్చుని, ముడి కట్టే ముందు ఆశీర్వాదం కోసం ఒక ఆలయానికి వెళుతుంది. ఊరేగింపు సందర్భంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా వధువు వెంట నడుస్తారు.
ఆమె కుటుంబ సభ్యులు అక్కడ లేకపోవడంతో, ఆమె సహచరులు సోనియా కోసం పాటలు పాడారు అలాగే నృత్యం చేశారు. అది ఆమెకు మరపురాని అనుభవంగా మారింది. వివాహానికి ముందు జరిగే ఈ వేడుక యొక్క చిత్రాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. “నా సహోద్యోగులు నా కుటుంబం పాత్రను పోషించారు. అలాగే, కరోనావైరస్ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా ‘బిందోరి’ని చక్కగా జరిపించారు. నేను దీన్ని నిజంగా ఇష్టపడ్డాను. సమాజంలోని మహిళలకు ఇది మంచి ఉదాహరణ” అని సోనియా ANI కి చెప్పారు.

ఆ వేడుకకు సంబంధించిన వీడియో..


Also Read: Funny Chimpanji: ఈ చింపాంజీ చేస్తున్న విన్యాసాలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.. మరి మీరు?