జమిలి ఎన్నికలు భారత్​కు అవసరం, ప్రిసైడింగ్ అధికారుల 80వ సదస్సులో ప్రధాని కీలక వ్యాఖ్యలు

|

Nov 26, 2020 | 3:17 PM

ముంబయిపై పాకిస్థాన్​ టెర్రరిస్టులు చేసిన దాడిని ఇండియా​ ఎన్నటికీ మరువదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు.

జమిలి ఎన్నికలు భారత్​కు అవసరం, ప్రిసైడింగ్ అధికారుల 80వ సదస్సులో ప్రధాని కీలక వ్యాఖ్యలు
Follow us on

ముంబయిపై పాకిస్థాన్​ టెర్రరిస్టులు చేసిన దాడిని ఇండియా​ ఎన్నటికీ మరువదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. 2008లో ఇదే రోజున.. పాకిస్థాన్​ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబయిపై దాడి చేశారని.. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద దాడి అని పేర్కొన్నారు.  ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలు విడిచిన పోలీసులు, పౌరులకు ప్రధాని నరేంద్రమోదీ శ్రద్ధాంజలి ఘటించారు. ఇప్పుడు ఇండియా కొత్త విధానాలతో ఉగ్రవాదంపై పోరాడుతోందని… ఇందులో భాగమైన భద్రతా బలగాలకు నమస్కరిస్తున్నాని చెప్పారు.

జమిలీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు :

‘ఒక దేశం, ఒక ఎన్నిక’ భారత్​కు చాలా అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నెలల వ్యవధిలో దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎలక్షన్స్  జరుగుతున్నాయని..ఈ విధానం వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. ప్రిసైడింగ్ అధికారుల 80వ సదస్సులో పాల్గొన్న ప్రధాని ఈ కామెంట్స్ చేశారు.  ఈ అంశాన్ని అధ్యయనం చేసి.. గవర్నమెంట్‌కు మార్గనిర్దేశం చేయాలని ప్రిసైడింగ్​ అధికారులకు మోదీ సూచించారు.

Also Read : నివర్‌ తుపానులో కొంతభాగం ఇంకా సముద్రంలోనే, లైట్ తీసుకోవద్దని ఐఎండీ హెచ్చరిక