PM Modi: ‘నేనూ మనిషినే.. తప్పులు జరుగుతుంటాయ్’.. ప్రధాని మోడీ మొదటి పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ మొదటిసారిగా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తోన్న పాడ్కాస్ట్ సిరీస్ ఇంటర్వ్యూకు ప్రధాని మోడీ అతిథిగా హాజరయ్యారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజైంది. త్వరలోనే ఫుల్ ఇంటర్వ్యూ రిలీజ్ కానుంది.
పాడ్క్యాస్ట్ల ప్రపంచంలోకి ప్రధాని నరేంద్రమోడీ అరంగేట్రం చేశారు. ఆయన ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త నిఖిల్ కామత్ ఇంటర్వ్యూ కు హాజరయ్యారు. ప్రధాని హాజరైన మొదటి పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ఇదే. తాజాగా ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. త్వరలోనే ఫుల్ ఇంటర్వ్యూ రానుంది. జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ పాడ్కాస్ట్ సిరీస్ ‘పీపుల్ బై WTF’లో ఈ ఇంటర్వ్యూ విడుదల కానుంది. పాడ్కాస్ట్క 2 నిమిషాల ట్రైలర్లో, నిఖిల్ కామత్ తో ప్రధానమంత్రి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నిఖిత్ కామత్ మాట్లాడుతూ .. ‘నేను ఒక ప్రధానితో కూర్చొని మాట్లాడుతున్నాను. నాకు భయంగా ఉంది’ అనగా.. దీనికి స్పందించిన ప్రధాని మోదీ . ‘ఇదే నా తొలి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ. దీన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో తెలియదు మరి’ అని చిరునవ్వులు కురిపించారు.
ఇంటర్వ్యూలో భాగంగా ‘యువకులు రాజకీయాల్లోకి రావాలనుకుంటే మీరిచ్చే సలహా ఏమిటి? అని నిఖిల్ కామత్ ప్రధాని మోడీని అడిగారు. దీనికి ఆయన ఇలా సమాధానమిచ్చారు. ‘ రాజకీయాల్లోకి యువతో పాటు మంచి వ్యక్తులు కూడా రావాలి. ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో పాలిటిలక్స్ లోకి రావాలి.. సొంత లక్ష్యాలు నెరవేర్చుకోవడం కోసం కాదు’ అన్నారు. ఈసందర్భంగా మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన పాత ప్రసంగాల గురించి ప్రస్తావిస్తూ.. ‘ నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని పొరపాట్లు చేశాను. నేను కూడా మనిషినే. దేవుడిని కాను కదా’ అని చెప్పుకొచ్చారు.
ఇదే సందర్బంగా ప్రస్తుతం వివిధ దేశాల మధ్య జరుగుతోన్న యుద్ధాలు, సంక్షోభ పరిస్థితులపై ప్రధాని స్పందించారు. తాము ఎప్పుడూ శాంతినే కోరుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఇంటర్వ్యూ ట్రైలర్ ను నిఖిల్ కామత్ సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా ప్రధాని మోడీ రీ ట్వీట్ చేశారు. ‘ఈ ఇంటర్వ్యూను మీరంతా ఎంజాయ్ చేస్తారు అని ఆశిస్తున్నా’ అని రాసుకొచ్చారు.
నిఖిల్ కామత్ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ..
I hope you all enjoy this as much as we enjoyed creating it for you! https://t.co/xth1Vixohn
— Narendra Modi (@narendramodi) January 9, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.