Modi: ప్రధాని మోదీ వ్యాక్సిన్‌ ఎప్పుడు తీసుకుంటారో తెలుసా..? ప్రకటించిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌..

PM Modi Will Take Vaccine: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే క్రమంలో ఎన్నో రోజుల నిరీక్షణకు తెరతీస్తూ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. శనివారం దేశవ్యాప్తంగా వ్యాక్సిన్..

Modi: ప్రధాని మోదీ వ్యాక్సిన్‌ ఎప్పుడు తీసుకుంటారో తెలుసా..? ప్రకటించిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌..

Updated on: Jan 17, 2021 | 5:44 AM

PM Modi Will Take Vaccine: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే క్రమంలో ఎన్నో రోజుల నిరీక్షణకు తెరతీస్తూ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. శనివారం దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ‌ పెద్ద ఎత్తున ప్రారంభమైంది. తొలిరోజు ఏకంగా 1.91 లక్షల మంది కరోనా టీకాను వేయించుకున్నారు. తొలి విడతలో భాగంగా ఆరోగ్య సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు ప్రధాని మోదీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. వ్యాక్సిన్‌ వేసుకునే విషయంలో రాజకీయాల నాయకులు తొందరపడొద్దు అంటూ పేర్కొన్నారు. కొన్ని నిబంధనల ఆధారంగానే టీకా పంపిణీ ఉండనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే మరి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, ఇతర నేతలు వ్యాక్సిన్‌ను ఎప్పుడు తీసుకుంటారు అనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో ఈ ప్రశ్నలకు కేంద్రమంత్రి తాజాగా చెక్‌ పెడుతూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సమాధానం చెప్పారు. శనివారం లక్నోలో జరిగిన ఓ సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. మొదట కోవిడ్‌ యోధులకు వ్యాక్సినేషన్‌ ఇవ్వడం ముగిసిన వెంటనే, 50 ఏళ్లకు పైబడిన వారికి టీకా ఇచ్చే సమయంలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, ఇతర రాజకీయ నాయుకులు టీకా తీసుకుంటారని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.

Also Read: Maharashtra Corona Updates: మహారాష్ట్రలో 19,87,678కి చేరిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులంటే..