ఈనెల 9న ఏపీకి ప్రధాని మోదీ

ఢిల్లీ: ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోదీ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రానున్నారు. ఈనెల 9న సాయంత్రం 4గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. పార్టీ శ్రేణులు ప్రధానికి ఘనస్వాగతం పలకాలని కన్నా విజ్ఞప్తి చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులు సన్నద్ధమవుతున్నారు.

ఈనెల 9న ఏపీకి ప్రధాని మోదీ

Updated on: Jun 01, 2019 | 1:32 PM

ఢిల్లీ: ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోదీ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రానున్నారు. ఈనెల 9న సాయంత్రం 4గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. పార్టీ శ్రేణులు ప్రధానికి ఘనస్వాగతం పలకాలని కన్నా విజ్ఞప్తి చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులు సన్నద్ధమవుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us