AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో గంటల తరబడి తల్లి నరకయాతన..!

ఒక ప్రయాణికురాలికి విమానం ఆలస్యం, రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బిడ్డతో ఉన్న ఆమెకు ఆహారం, సౌకర్యాలు లభించలేదు. వినియోగదారుల కమిషన్ విచారణ జరిపి, విమాన సంస్థకు వాతావరణం కారణంగా రద్దు వాదన చెల్లదని తేల్చింది. ప్రయాణికురాలికి ₹1.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు విమానయాన సంస్థల బాధ్యతను స్పష్టం చేసింది.

ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో గంటల తరబడి తల్లి నరకయాతన..!
Flight Delay Compensation
Balaraju Goud
|

Updated on: Sep 28, 2026 | 11:24 AM

Share

ఒక సాధారణ విమాన ప్రయాణం.. ప్రయాణికురాలికి మాత్రం గంటల తరబడి నిరీక్షణగా మారింది. బిడ్డతో కలిసి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న మహిళకు విమానం ఆలస్యం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరకు విమానం రద్దు కావడం, ఆహారం, పానీయాలు, వసతి వంటి కనీస సౌకర్యాలు అందకపోవడంతో ఆమె వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. విచారణ అనంతరం విమానయాన సంస్థకు పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

2017లో నమోదైన ఈ కేసులో.. ఓ మహిళా ప్రయాణికురాలు ట్రావెల్ ఏజెంట్ ద్వారా లాస్ ఏంజిల్స్ నుంచి ముంబైకి బీజింగ్ మీదుగా వెళ్లేందుకు బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నారు. తిరుగు ప్రయాణం జూలై 19న లాస్ ఏంజిల్స్ నుంచి ఉండాల్సి ఉంది. అయితే విమానం సుమారు రెండు గంటలు ఆలస్యంగా బోర్డింగ్‌కు వస్తుందని ఆమెకు సమాచారం ఇచ్చారు. బోర్డింగ్ పూర్తయిన తర్వాత కూడా విమానం రన్‌వేపైనే నిలిచిపోయింది. గంటలు గడిచినా టేకాఫ్ కాలేదు.

ఈ సమయంలో ప్రయాణికులకు సరైన ఆహారం, పానీయాలు అందించలేదని మహిళ ఫిర్యాదు చేసింది. తనతో చిన్నారి ఉండటంతో పాలు తయారు చేసేందుకు వేడి నీళ్లు కూడా ఇవ్వలేదని పేర్కొంది. కొంతసేపటి తర్వాత విమానం రద్దు చేసినట్లు ప్రకటించడంతో ఆమె, ఆమె బిడ్డ విమానాశ్రయంలోనే గంటల తరబడి ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలోనూ తగిన ఆహారం, వసతి కల్పించలేదని ఆమె ఆరోపించింది.

అయితే భారీ వర్షాల కారణంగానే విమానాన్ని రద్దు చేశామని, పరిస్థితులు తమ నియంత్రణలో లేవని విమానయాన సంస్థ వాదించింది. అందువల్ల పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. కానీ వాతావరణ నివేదికలను పరిశీలించిన వినియోగదారుల కమిషన్.. విమానం రద్దు చేయాల్సినంత తీవ్ర పరిస్థితులు లేవని నిర్ధారించింది.

విచారణ అనంతరం ప్రయాణికురాలు, ఆమె బిడ్డ ఎదుర్కొన్న ఇబ్బందులకు విమానయాన సంస్థ బాధ్యత వహించాలని కమిషన్ తేల్చింది. దీంతో బాధితురాలికి రూ. 1 లక్ష పరిహారం, కేసు పరిష్కారానికి మరో రూ. 50 వేల చెల్లించాలని ఆదేశించింది. అంటే మొత్తం రూ. 1.50 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. ఈ తీర్పు విమాన ఆలస్యం లేదా రద్దు సమయంలో ప్రయాణికులకు అందించాల్సిన కనీస సౌకర్యాలు, సేవల బాధ్యతపై మరోసారి చర్చకు దారితీసింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
విమానంలో బిడ్డతో తల్లి గంటల నిరీక్షణ.. చివరకు..!
విమానంలో బిడ్డతో తల్లి గంటల నిరీక్షణ.. చివరకు..!
వరదలో కొట్టుకొచ్చిన మద్యం బాటిల్స్..ఇది కదా అసలైన రిలీఫ్ ప్యాకేజీ
వరదలో కొట్టుకొచ్చిన మద్యం బాటిల్స్..ఇది కదా అసలైన రిలీఫ్ ప్యాకేజీ
ఆ ఒక్క మార్పుతో రెచ్చిపోతోన్న కోహ్లీ..: శుభ్మన్ గిల్
ఆ ఒక్క మార్పుతో రెచ్చిపోతోన్న కోహ్లీ..: శుభ్మన్ గిల్
విద్యుత్ కొరతపై హీట్.. పవర్ ప్లాంట్లకు కిషన్ రెడ్డి!
విద్యుత్ కొరతపై హీట్.. పవర్ ప్లాంట్లకు కిషన్ రెడ్డి!
EPFO క్లెయిమ్స్, పెన్షన్ సమస్యలు ఉన్నాయా? ఈ క్యాంప్‌కు వెళ్తే..
EPFO క్లెయిమ్స్, పెన్షన్ సమస్యలు ఉన్నాయా? ఈ క్యాంప్‌కు వెళ్తే..
సింగిల్ టేక్ ఆర్టిస్ట్ డైలాగ్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
సింగిల్ టేక్ ఆర్టిస్ట్ డైలాగ్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
స్థానిక సమస్యల బాధ్యత ఎంపీదా? మున్సిపాలిటీదా? చట్టం ఏం చెప్తోంది?
స్థానిక సమస్యల బాధ్యత ఎంపీదా? మున్సిపాలిటీదా? చట్టం ఏం చెప్తోంది?
ఎలుకలు, చుంచెలుక కాటుతో విసిగిపోయారా? ఇది ఒక్క చుక్కతో ఇంటి నుండి
ఎలుకలు, చుంచెలుక కాటుతో విసిగిపోయారా? ఇది ఒక్క చుక్కతో ఇంటి నుండి
గేమ్ షురూ.. అనిరుధ్‌కు కరెక్ట్ పోటీ అతడేనా..?
గేమ్ షురూ.. అనిరుధ్‌కు కరెక్ట్ పోటీ అతడేనా..?
నాగుపాము పడగవిప్పి.. నిటారుగా ఎందుకు నిలుచుంటుంది..?
నాగుపాము పడగవిప్పి.. నిటారుగా ఎందుకు నిలుచుంటుంది..?