AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటీ.. ఈ టాలీవుడ్ హీరోయిన్ అందరికంటే చిన్నదా.!! ఏజ్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొంతమంది తమ అందం అభినయంతో ఆకట్టుకుంటుంటే మరికొంతమంది కేవలం గ్లామర్ తోనే ప్రేక్షకులను కవ్విస్తున్నారు. ఇంకొంతమంది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కొందరు. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్ చిన్న ఏజ్ లోనే సినిమాల్లోకి వస్తున్నారు.

ఏంటీ.. ఈ టాలీవుడ్ హీరోయిన్ అందరికంటే చిన్నదా.!! ఏజ్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 28, 2026 | 12:02 PM

Share

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల ఎంట్రీ ఎప్పటికప్పుడు పెరుగుతోంది. కొందరు తమ అందంతో ఆకట్టుకుంటే.. మరికొందరు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకుంటున్నారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా చాలా చిన్న వయసులోనే హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న నటీమణుల సంఖ్య పెరిగింది. టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్ల గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తొచ్చే పేర్లలో కృతి శెట్టి, శ్రీలీల ఉంటారు. అయితే వీరిద్దరి కంటే కూడా చిన్న వయసులోనే హీరోయిన్‌గా పరిచయమైన ఓ బ్యూటీ ప్రస్తుతం సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా?

వామ్మో.. ఆమె ఈమే ఒక్కరేనా..? ప్యారడైజ్‌లో కీలక పాత్ర.. ఈ నటిని బయట చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!

ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన కృతి శెట్టి.. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదే విధంగా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్రీలీల కూడా పెళ్లిసందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో స్టార్ హీరోల సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగింది. అయితే వీరిద్దరి కంటే తక్కువ వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరో నటి ఉంది. ఆమెనే అననతిక సునీల్ కుమార్. మ్యాడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

మహేష్ బాబు, ప్రభాస్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే

అననతికకు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం మ్యాడ్. ఈ సినిమాలో అననతిక తన నటనతో పాటు అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెద్దగా సినీ అనుభవం లేకపోయినా స్క్రీన్‌పై సహజంగా కనిపిస్తూ మంచి ప్రశంసలు అందుకుంది. తెలుగు ప్రేక్షకులకు మ్యాడ్ సినిమాతో పరిచయమైన అననతిక.. తమిళంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ చిత్రంలోనూ కనిపించింది. ఇటీవలే రోమాంచకం అనే సినిమాలో నటించింది. అలాగే పరిమిళ అండ్ కో అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈ చిన్నదాని చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం యంగ్ హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా ఆమె అడుగులు వేస్తోంది. అననతిక వయసు కేవలం 20 ఏళ్లు అని సమాచారం. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం అననతికకు కలిసొచ్చే అంశంగా మారింది. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఆ హీరో చాలా గొప్పోడు.. స్కూటర్‌ మీద తిరిగే నాకు కారు కొనిచ్చాడు.. అది ఇప్పటికీ నాతోనే ఉంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us