కీలక నిర్ణయం పై మరోసారి అభిలపక్ష భేటీ

| Edited By:

Jun 19, 2019 | 6:58 AM

దేశవ్యాప్తంగా ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నిర్వహించే అంశం పై నేడు అఖిలపక్ష భేటీ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల అధ్యక్షులకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లేఖలు రాశారు. ఈ భేటీలో ఒకేసారి ఎన్నికలు అంశంతో పాటు వివిధ విషయాలు చర్చకు రానున్నాయి. అయితే ముందుగానే విదేశీ పర్యటన ఖరారు కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సమావేశానికి హాజరు […]

కీలక నిర్ణయం పై మరోసారి అభిలపక్ష భేటీ
Follow us on

దేశవ్యాప్తంగా ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నిర్వహించే అంశం పై నేడు అఖిలపక్ష భేటీ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల అధ్యక్షులకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లేఖలు రాశారు. ఈ భేటీలో ఒకేసారి ఎన్నికలు అంశంతో పాటు వివిధ విషయాలు చర్చకు రానున్నాయి.

అయితే ముందుగానే విదేశీ పర్యటన ఖరారు కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సమావేశానికి హాజరు కావడం లేదని సమాచారం. వస్తే పార్టీ అధ్యక్షుడే రావాలనీ, లేనిపక్షంలో మరెవరినీ పంపవద్దని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో సమావేశ చర్చనీయాంశాలకు సంబంధించి తమ పార్టీ అభిప్రాయాన్ని తెలుపుతూ ఆయన ఓ లేఖ రాశారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణ అనే అంశంపై సమగ్రంగా చర్చించాలన్నారు. రాజ్యాంగ రూపకల్పన జరిగిన సమయంలో కూడా పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం, లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలపై విస్తృతంగా చర్చించారని లేఖలో వివరించారు. అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాతే ముందడుగు వేయాలని తాము కోరుతున్నట్లు లేఖలో బాబు పేర్కొన్నారు. ఈ లేఖను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి పంపించారు.