
పండుగలు మనల్ని అందరినీ ఏకం చేస్తాయని, అవి మనలో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయన్నారు ప్రధాని మోదీ. దసరా సందర్భంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మన పుణ్యభూమిలో ఉన్న పండుగలు ఎంతో గొప్పవని, సామాజిక విలువలతో కూడిన పండుగలన్నారు ప్రధాని. సామాజిక జీవితాలను మన పండుగలు ప్రభావితం చేస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన రావణ దహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గాంధీజీ 150 వ జయంతిని జరుపుకుంటున్న దేశ ప్రజలంతా ఒకే లక్ష్యం కోసం పనిచేయాలని, ఆహార వృధాను అరికట్టాలని, ఇంధనం, నీటిని పొదుపుగా వినియోగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
May the blessings of Prabhu Shri Ram always remain upon us.
May the power of truth, goodness and compassion always prevail.
May evil be eliminated.
Jai Shri Ram! ?? pic.twitter.com/OCZOLsX7ug
— Narendra Modi (@narendramodi) October 8, 2019