పిలియన్ రైడర్లూ మీకూ తప్పదిక న్యూ రూల్!

| Edited By:

Jan 09, 2020 | 5:35 PM

ఈ మధ్య ట్రాఫిక్ రూల్స్‌ని రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా.. కఠిన తరం చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్య ఇదే పెద్ద హాట్‌ టాపిక్‌గా నిలిచింది. వేలకు వేలు చలాన్లు వేయడంతో.. వాహనదారులు ఒక్కసారిగా అవాక్కయారు. దీంతో.. ఇప్పుడు హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి రావాలంటేనే వాహనదారులు భయపడే స్థితి వచ్చింది. అలాగే మరో న్యూ రూల్ కూడా తీసుకొచ్చారు ట్రాఫిక్ పోలీసులు. అదే.. వెనక కూర్చొన్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని. […]

పిలియన్ రైడర్లూ మీకూ తప్పదిక న్యూ రూల్!
Follow us on

ఈ మధ్య ట్రాఫిక్ రూల్స్‌ని రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా.. కఠిన తరం చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్య ఇదే పెద్ద హాట్‌ టాపిక్‌గా నిలిచింది. వేలకు వేలు చలాన్లు వేయడంతో.. వాహనదారులు ఒక్కసారిగా అవాక్కయారు. దీంతో.. ఇప్పుడు హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి రావాలంటేనే వాహనదారులు భయపడే స్థితి వచ్చింది. అలాగే మరో న్యూ రూల్ కూడా తీసుకొచ్చారు ట్రాఫిక్ పోలీసులు. అదే.. వెనక కూర్చొన్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని.

అదేంటని షాక్ అవుతున్నారా! నిజమే తాజాగా.. ఇక నుంచి బైక్‌పై ఎంత మంది ప్రయాణిస్తే వారందరూ హెల్మెట్స్‌ని తప్పక ధరించాలి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఇక నుంచి హెల్మెట్ ధరించాలి. పెట్ డాగ్స్, యానిమల్స్‌కి కూడా ఈ నిబంధన వర్తిస్తుందట. నిజానికి.. ఈ రూల్ పాతదే. ట్రాఫిక్ నిబంధనల్లో ఈ రూల్ ఉన్నప్పటికీ.. ఆ విభాగం దీన్ని తప్పనిసరి చేయలేదు. కానీ.. ఈ మధ్య వెనుక కూర్చున్న వారు (పిలియన్ రైడర్స్) కూడా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న సంఘటనలు పెరగడంతో.. పోలీసులు ఈ కొత్త రూల్‌ని అమల్లోకి తీసుకొచ్చారు.

ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో మాత్రమే పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నియమం ఉంది. ఇప్పుడు ఈ విధానాన్ని హైదరాబాద్‌లో కూడా అమలు పరచనున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2019లో సుమారు 129 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. ఇందులో 42 మంది బైక్ యాక్సిడెంట్స్‌లో చనిపోగా.. వీరిలో 20 మంది పిలియన్ రైడర్స్‌ అని రికార్డుల్లో ఉంది.