
ఎమ్మెల్యే జర్నలిస్ట్‌ను బెదిరించిన కేసులో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అరెస్ట్‌కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనలో మహిపాల్‌రెడ్డిపై అట్రాసిటి కేసు నమోదైంది. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని అరెస్టు చేయాలని రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ కేసుపై న్యాయస్థానం శుక్రవారం విచారించనుంది.
జర్నలిస్టును ఫోన్‌లో దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిపాల్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఓ దినపత్రికకు చెందిన జర్నలిస్టు సంతోష్‌నాయక్‌ను ఫోన్‌లో దూషించిన ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈమేరకు అమీన్‌పూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఐపీసీ 109, 448, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.