సామాన్యులకు శుభవార్త

| Edited By: Ram Naramaneni

Oct 18, 2020 | 10:17 PM

న్యూఢిల్లీ: సమాన్యులకు శుభవార్త. ఉద్యోగులకు ఇది సంతోషకరమైన విషయం. PFపై వచ్చే వడ్డీ 8.65 శాతం ఉండనుంది. దీని వల్ల 6 కోట్ల మందికి నేరుగా లబ్ధి చేకూరనుంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఈ వడ్డీ శాతం 8.55 ఉండేది. ఫిబ్రవరి 21న ప్రత్యేకంగా సమావేశమైన ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ మేరకు వెల్లడించింది. 2017-18లో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అమల్లోకి రాబోతోంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ మాట్లాడుతూ ఉద్యోగులకు పిఎఫ్‌పై అత్యధిక […]

సామాన్యులకు శుభవార్త
Follow us on

న్యూఢిల్లీ: సమాన్యులకు శుభవార్త. ఉద్యోగులకు ఇది సంతోషకరమైన విషయం. PFపై వచ్చే వడ్డీ 8.65 శాతం ఉండనుంది. దీని వల్ల 6 కోట్ల మందికి నేరుగా లబ్ధి చేకూరనుంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఈ వడ్డీ శాతం 8.55 ఉండేది. ఫిబ్రవరి 21న ప్రత్యేకంగా సమావేశమైన ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ మేరకు వెల్లడించింది. 2017-18లో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అమల్లోకి రాబోతోంది.

కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ మాట్లాడుతూ ఉద్యోగులకు పిఎఫ్‌పై అత్యధిక వడ్డీ ఇవ్వాలనే నిర్ణయాన్ని అమలు చేయబోతున్నట్టు తెలిపారు. ఇందుకు సమావేశంలో పాల్గొన్న సభ్యులందరూ అంగీకారం తెలిపినట్టు చెప్పారాయన. అయితే ఈ ప్రతిపాదన తర్వాత స్టేజ్‌లో ఆర్ధిక శాఖ వద్దకు వెళ్లనుంది. అక్కడ కూడా ఓకె అయితే వెంటనే అమల్లోకి వస్తుంది.

పీఎఫ్‌పై వడ్డీ శాతం
2017-18లో   8.55%
2016-17లో   8.65%
2015-16లో   8.8%
2013-14లో   8.75%
2014-15లో   8.75%
2012-13లో   8.5%