సామాన్యుడికి ‘పెట్రో’ షాక్.. వరుసగా 17వ రోజు ఎంత పెరిగిందంటే..!

గత కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు సామాన్యులకు షాక్ మీద షాక్ ఇస్తున్నాయి. అసలే కరోనా కష్టకాలం.. ఆపై అంతంత మాత్రంగా వచ్చే ఆదాయంతో సతమతమవుతున్న వారికి ఈ పెట్రోల్ ధరలు మరింత భారంగా మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా 17వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా మంగళవారం పెట్రోల్ ధర లీటరుకు 20 పైసలు పెరగగా, డీజిల్‌పై 55 పైసలు చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. […]

సామాన్యుడికి పెట్రో షాక్.. వరుసగా 17వ రోజు ఎంత పెరిగిందంటే..!

Updated on: Jun 23, 2020 | 9:24 AM

గత కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు సామాన్యులకు షాక్ మీద షాక్ ఇస్తున్నాయి. అసలే కరోనా కష్టకాలం.. ఆపై అంతంత మాత్రంగా వచ్చే ఆదాయంతో సతమతమవుతున్న వారికి ఈ పెట్రోల్ ధరలు మరింత భారంగా మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా 17వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా మంగళవారం పెట్రోల్ ధర లీటరుకు 20 పైసలు పెరగగా, డీజిల్‌పై 55 పైసలు చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

ఈ పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.79.76కి చేరగా, లీటర్ డీజిల్ ధర రూ.79.40కు ఎగబాకింది. దీనితో వరుసగా 17 రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 9.41 పెరగగా.. డీజిల్ ధర లీటరుకు రూ. 9.10కు ఎగిసింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపు 12 వారాల షట్‌డౌన్ అనంతరం చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతోన్న ప్రజలకు ఈ పెరిగిన పెట్రోల్ ధరలతో మరింత ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తున్న నేపథ్యంలో ఆయిల్‌ ధరలకు డిమాండ్ బాగా పెరిగింది.

మెట్రో నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి…

  • ఢిల్లీ – పెట్రోల్ రూ. 79.76, డీజిల్ రూ. 79.40
  • కోల్‌కతా – పెట్రోల్ రూ. 81.45, డీజిల్ రూ. 74.63
  • ముంబై – పెట్రోల్ రూ. 86.54, డీజిల్ రూ. 77.76
  • చెన్నై – పెట్రోల్ రూ. 83.04, డీజిల్ రూ. 76.77

Also Read:

టీఎస్ ఎంసెట్ రాసే ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్..

జగన్ సర్కార్ మరో సంచలనం.. వారి ఖాతాల్లోకి నేరుగా రూ. 15 వేలు..

వర్మా.. రెస్ట్ ఇన్ పీస్.. నీపై కేసులు వేయనుః అమృత

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆగష్టులో సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు ఏర్పాట్లు..!

సుశాంత్ సూసైడ్‌లో కొత్త ట్విస్ట్.. ఆ ఇద్దరి మధ్య ‘అఫైర్’..!

జగన్ సర్కార్ సంచలనం.. ఉద్దానం కిడ్నీ బాధితులకు శుభవార్త..