పెట్రో మంట.. నాలుగో రోజూ ధరలు పైపైకి..

| Edited By: Pardhasaradhi Peri

Jun 10, 2020 | 11:43 AM

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల పరుగు వినియోగదారులకు షాకిస్తోంది. బుధవారం వరుసగా నాలుగవ రోజు కూడా ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర

పెట్రో మంట.. నాలుగో రోజూ ధరలు పైపైకి..
Follow us on

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల పరుగు వినియోగదారులకు షాకిస్తోంది. బుధవారం వరుసగా నాలుగవ రోజు కూడా ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు 40 పైసలు, డీజిల్‌ 45 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. గత నాలుగు రోజులలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 2.14 డీజిల్ ధర లీటరుకు రూ.2.23 (ఢిల్లీ రేట్లు) పెరగడం గమనార్హం. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు 39 పైసలు పెరిగి 80.40 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధర 43 పైసలు పెరిగి రూ.70.35 కు చేరింది. ఇప్పుడు లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తున్న నేపథ్యంలో ఆయిల్‌ ధరలకు డిమాండ్ పెరిగింది.

కాగా.. చెన్నైలో లీటర్ పెట్రోల్‌ రూ. 77.43, డీజిల్‌ రూ. 70.13, న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ రూ.73.40, డీజిల్‌ రూ.71.62, హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్‌ రూ.76.20, డీజిల్‌ రూ.70, అమరావతిలో లీటర్ పెట్రోల్‌ రూ.76.76, డీజిల్‌ రూ. 70.62 గా ఉన్నాయి.

Also Read: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్: ఈ నెల 13 వరకు రైతుబంధు దరఖాస్తుకు అవకాశం