య‌జ‌మాని కోసం తాచుపాముతో వీరోచిత పోరాటం…చివ‌ర‌కు

య‌జ‌మాని కోసం తాచుపాముతో వీరోచిత పోరాటం...చివ‌ర‌కు

ఈ రోజుల్లో మ‌నుషుల కంటే కుక్క‌లు ఎక్కువ‌ విశ్వాసం చూపిస్తోన్న విష‌యం తెలిసిందే. తాజాగా ఓ కుక్క మ‌రోసారి ఈ విష‌యాన్ని ప్రూవ్ చేసింది. తన యజమానిని కరిచేందుకు ప్రయత్నించిన పామును…పెంపుడు కుక్క నోట కరిచింది. ఈ క్ర‌మంలో పాము కుక్క‌ను కాటు వేసింది. యజమాని ప్రాణాలను కాపాడే క్ర‌మంలో…త‌న ప్రాణాల‌ను అర్పించింది కుక్క‌. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా క‌ల్లూరులో కిశోర్ అనే వ్యక్తి ఆర్ఎంపీగా వ‌ర్క్ చేస్తున్నాడు. […]

Ram Naramaneni

|

Apr 13, 2020 | 2:46 PM

ఈ రోజుల్లో మ‌నుషుల కంటే కుక్క‌లు ఎక్కువ‌ విశ్వాసం చూపిస్తోన్న విష‌యం తెలిసిందే. తాజాగా ఓ కుక్క మ‌రోసారి ఈ విష‌యాన్ని ప్రూవ్ చేసింది. తన యజమానిని కరిచేందుకు ప్రయత్నించిన పామును…పెంపుడు కుక్క నోట కరిచింది. ఈ క్ర‌మంలో పాము కుక్క‌ను కాటు వేసింది. యజమాని ప్రాణాలను కాపాడే క్ర‌మంలో…త‌న ప్రాణాల‌ను అర్పించింది కుక్క‌. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా క‌ల్లూరులో కిశోర్ అనే వ్యక్తి ఆర్ఎంపీగా వ‌ర్క్ చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నా సమయంలో అత‌డు త‌న ఇంట్లోని వెనుక గదిలో నిద్రిస్తున్నాడు. ఆ టైమ్ లో ఇంటి వెనుక పెరుడులోనుంచి తాచుపాము  గ‌దిలోకి ప్రవేశించింది. దీన్ని గమనించిన వారి పెంపుడు కుక్క (స్నూపీ) ఇంట్లోకి వెళ్లి తాచుపాముపై దాడి చేసింది.దీన్ని గ‌మ‌నించిన‌ కిషోర్ కర్రతో పామును కొట్టబోయాడు. తాచుపాము కిషోర్‌పై ఎదురు దాడి చేసింది. దీంతో స్నూపి పాముపై దూకి నడుము భాగంలో నోటితో గట్టిగా పట్టుకుంది. ఒత్తిడికి గురైన పాము… స్నూపిని కాటేసింది. అయినా కూడా స్నూపి లెక్కచేయకుండా పామును ఇంటి నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. అనంత‌రం కిషోర్ కర్రతో పామును చంపి… స్నూపిని హాస్ప‌ట‌ల్ కి తీసుకెళ్లే క్ర‌మంలో అది మార్గ‌మ‌ధ్య‌ములోనే మరణించింది. ఎంతో ప్రేమతో పెంచుకున్న కుక్క ప్రాణాలకు తెగించి త‌మ‌ కాపాడిందని, చివ‌ర‌కు అది క‌న్నుమూసింద‌ని కుటుంబమంతా శోకసంద్రంలో మునిగారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu