AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aloo Bhindi Recipe: పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్.. టేస్టీ ఆలూ బెండకాయ ఫ్రై! నిమిషాల్లో రెడీ!

బెండకాయ అనగానే చాలామందికి జిగురు గుర్తుకు వస్తుంది. కానీ, సరైన పద్ధతిలో వండితే బెండకాయ వేపుడు కంటే రుచికరమైన వంటకం మరొకటి ఉండదు. అందులోనూ బంగాళదుంపలు కలిపి చేసే 'ఆలూ భిండి' ఉత్తర భారతదేశంలో ఎంతో ఫేమస్. అన్నం, రోటీ, చపాతీల్లోకి అదిరిపోయే ఈ వంటకాన్ని జిగురు లేకుండా కరకరలాడేలా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Aloo Bhindi Recipe: పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్.. టేస్టీ ఆలూ బెండకాయ ఫ్రై! నిమిషాల్లో రెడీ!
Aloo Bhindi Fry Recipe
Bhavani
|

Updated on: Dec 26, 2025 | 8:49 PM

Share

తక్కువ సమయం.. తక్కువ పదార్థాలు.. కానీ అద్భుతమైన రుచి! పంజాబీ స్టైల్ ఆలూ బెండకాయ ఫ్రై ఇంట్లోనే హోటల్ రుచితో రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. బెండకాయ జిగురు రాకుండా, బంగాళదుంపలు మెత్తబడకుండా పర్ఫెక్ట్‌గా వేగాలంటే ఏం చేయాలో ప్రముఖ ఫుడ్ ఎక్స్‌పర్ట్ స్వాతి అందించిన ఈ స్పెషల్ రెసిపీ మీకోసం. సాధారణంగా బెండకాయ వండేటప్పుడు జిగురు రావడం పెద్ద సమస్య. అయితే బంగాళదుంపలతో కలిపి చేసే ఈ మసాలా వేపుడులో కొన్ని మెళకువలు పాటిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు:

బెండకాయలు (అర కిలో)

బంగాళదుంపలు (3 మీడియం సైజ్)

టమోటాలు (2 చిన్నవి – ప్యూరీ కోసం)

అల్లం/వెల్లుల్లి ముక్కలు

కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు

ఆయిల్, కసూరీ మేతీ

తయారీ విధానం:

బెండకాయలను కడిగి, తడి లేకుండా పూర్తిగా తుడవాలి. తడి ఉంటే జిగురు వస్తుంది. బంగాళదుంపలను ముక్కలుగా కోసి నీటిలో వేయాలి (దీనివల్ల స్టార్చ్ పోయి ముక్కలు అతుక్కోవు).

బాణలిలో నూనె వేసి ముందుగా బంగాళదుంప ముక్కలను వేయించి పక్కన పెట్టుకోవాలి.

అదే నూనెలో వెల్లుల్లి, బెండకాయ ముక్కలు వేసి మధ్యస్థ మంటపై వేయించాలి. జిగురు పూర్తిగా పోయే వరకు వేయించడం ముఖ్యం.

బెండకాయ వేగాక, అందులో ముందుగా వేయించిన ఆలూ ముక్కలు, కారం, పసుపు, ఉప్పు మరియు గరం మసాలా వేసి 2 నిమిషాలు కలపాలి.

మధ్యలో కొంచెం ఖాళీ చేసి టమోటా ప్యూరీ వేసి, పచ్చి వాసన పోయే వరకు ఉడికించాలి. చివరగా కసూరీ మేతీ చల్లితే మంచి సువాసన వస్తుంది.

బెండకాయ ముక్కలను మరీ చిన్నగా కోయవద్దు, దీనివల్ల జిగురు ఎక్కువవుతుంది.

టమోటా ముక్కల కంటే ప్యూరీ వేయడం వల్ల వంటకం త్వరగా పూర్తి అవుతుంది ముక్కలు మెత్తబడవు.

జిగురు పోయే వరకు టమోటాలు లేదా ఉప్పు వేయకండి.

రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే