#COVID19 రాగి చెట్టుకు పూజ చేస్తే కరోనా రాదట.. ఎక్కడో తెలుసా?

|

Mar 23, 2020 | 6:38 PM

కరోనా వైరస్ ప్రజలను అప్రమత్తం చేస్తుందో లేదో కానీ.. జనాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. దాంతో కొందరు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటే.. మరికొందరు.. మూఢనమ్మకాల వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణాలోని నిర్మల్ జిల్లాలో సరిగ్గా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది.

#COVID19 రాగి చెట్టుకు పూజ చేస్తే కరోనా రాదట.. ఎక్కడో తెలుసా?
Follow us on

People are believing blind worships to control Corona-virus: కరోనా వైరస్ ప్రజలను అప్రమత్తం చేస్తుందో లేదో కానీ.. జనాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. దాంతో కొందరు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటే.. మరికొందరు.. మూఢనమ్మకాల వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణాలోని నిర్మల్ జిల్లాలో సరిగ్గా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. కరోనా రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తల కంటే మూఢ నమ్మకాలని నమ్ముకుంటున్నారు నిర్మల్ జిల్లా ముధోల్ టౌన్ లో..

కరోనా విజృంభణ ప్రతీ ఒక్కరిలో ఆందోళన రేపుతోంది. ప్రభుత్వాలు వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యల్లో నిమగ్నమైతే ప్రజలు మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన గైడ్ లైన్స్ ని గాలికి వదిలేసి.. యధేఛ్ఛగా తిరిగేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ కు మొగ్గుచూపిన వారిలో 90 శాతం సోమవారం రోడ్డెక్కారు.

పట్టణాల్లో పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో ప్రజలు వైద్య సౌకర్యాలను కాకుండా మూఢ నమ్మకాలను నమ్ముకుంటున్నారు. ఇదే తరహాలో నిర్మల్ జిల్లా ముధోల్ పట్టణ శివారులోని కాలనీల్లో ప్రజలు.. ముఖ్యంగా మహిళలు కరోనా రాకుండా ఉండాలంటే రాగి చెట్టుకు పూజలు చేయాలంటూ బిందెల్లో నీళ్లు తీసుకుని బయలు దేరారు. రాగి చెట్టుకు పూజలు చేసిన మహిళలు ఆ తర్వాత పరస్పరం పసుపు పూసుకుంటూ ఎవరికీ కరోనా రావద్దని విష్ చేసుకున్నారు.

ఇదేమని అడిగితే… రాగి చెట్టుకు పూజలు చేస్తే తమ కుటుంబాల్లో ఎవరికీ కరోనా వైరస్ రాదని చెబుతున్నారు. ఎంతైనా ఎవరి విశ్వాసాలు వారివి అనుకోవడం కంటే ఏమి అనలేం కదా అని అక్కడికి వెళ్లిన మీడియా ప్యారు అనుకుంటూ వెనుతిరిగారు.