Janasena cheif Pawan Kalyan’s new deadline for break-up with BJP: బీజేపీతో బ్రేకప్‌కు పవన్ కల్యాణ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారా? పరిశీలిస్తే అదే కనిపిస్తుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొన్నీమధ్యే జత కట్టారు కదా.. అప్పుడే బ్రేకప్ ఏంటనిపిస్తున్నా జరిగిన, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అంతేనంటున్నారు. వైసీపీ అధినేత జగన్ ఈ మధ్య బీజేపీకి దగ్గరవుతున్నట్లు కనిపించడంతో పవన్ కల్యాణ్ బీజేపీకి దూరమవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: తాగునీటి కొరత నివారణకు కొత్త ప్లాన్
ఆయన దోస్తీ కట్టారు. కానీ అప్పుడే ఝలక్ పడింది. తన రాజకీయ ప్రత్యర్థి కొత్త సిగ్నల్స్ పంపారు. దీంతో ఇప్పుడు ఆ సేనాని డైలామాలో పడ్డారు. తన దారెటు? అనేది తేల్చుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు ఓ అవకాశం వచ్చింది. ఆ టెస్ట్ పూర్తయితే ఏదో ఒక నిర్ణయం తీసుకునే పనిలో ఆయన పడ్డారట. ఇంతకీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు ఎదురైన పరీక్ష ఏంటి ? ఆ తర్వాత ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?
ఇదీ చదవండి: జీవో 107పై మడతపేచీ.. రేపట్నించి టీడీపీ ప్లాన్ ఇదే
ఏపీ రాజకీయాల్లో బీజేపీకి జనసేన దగ్గరైంది. కలిసి ఉమ్మడి కార్యాచరణ ముందుకు వెళుతోంది. కలిసి పోరాటాలు చేద్దామని అనుకునే టైమ్‌లో…పవన్‌కు ఓ స్పీడ్ బ్రేకర్ వచ్చి పడింది. అదే జగన్,బీజేపీ దోస్తీ. ఇటీవల ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు. ప్రధాని గంటన్నరకు పైగా సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ తర్వాత కేంద్ర మంత్రివర్గంలో వైసీపీ చేరుతుందని ప్రచారం జరిగింది. కేబినెట్‌లో చేరాలని ప్రధాని జగన్‌ను ఆహ్వానించారని టాక్ పుట్టుకొచ్చింది. అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు. ఇటు జగన్,బీజేపీ బంధంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. జగన్‌తో బీజేపీ కలిస్తే..తాను దూరమవుతానని చెప్పారు.
ఇదీ చదవండి: జగన్ ప్రభుత్వానికి అమరావతి హైకోర్టు షాక్
ఇప్పుడు పవన్ బీజేపీతో కలిసి ఉంటారా? లేదా అనేందుకు తాజా డెడ్‌లైన్ మార్చి 13 అని ప్రచారం జరుగుతోంది. ఇటీవల రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఏపీలో నాలుగు సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సీట్లకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీ మార్చి 13. నాలుగు సీట్లలో ఒక సీటు బీజేపీకి జగన్ ఇస్తారని తెలుస్తోంది. ఆ ఒక సీటుకు బీజేపీ తరపున నామినేషన్ పడితే…అదే రోజు కమలంతో దోస్తీకి పవన్ కటీఫ్ చెబుతారని సమాచారం. దీంతో ఇప్పుడు బీజేపీ,జనసేన బంధానికి మార్చి 13 డెడ్‌లైన్‌గా చెబుతున్నారు. మొత్తానికి ఇప్పుడు బీజేపీకి జగన్ రాజ్యసభ సీటు ఇస్తారా? ఆ సీటు ఇచ్చిన వెంటనే పవన్ దోస్తీకి కటీఫ్ చెబుతారా? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: మళ్ళీ తెరమీదికి గ్రేటర్ రాయలసీమ.. గంగుల ఉద్యమం