త్రీ క్యాపిటల్స్ కాదు.. త్రిశంకు రాజధాని: పవన్ పంచ్ అదిరింది!

|

Jan 07, 2020 | 5:07 PM

ఏపీకి మూడు రాజధానులు కాదు.. త్రిశంకు రాజధానిని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాజధాని కోసం జరుగుతున్న పోరాటాన్ని అరెస్టులతోను, గృహ నిర్బంధాలతోను ఆపలేరని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి భ్రమల్లోంచి ముఖ్యమంత్రి బయటికి రావాలని పవన్ కల్యాణ్ సూచించారు. రెండ్రోజులుగా మరింత తీవ్ర రూపం దాల్చిన రాజధాని రైతుల ఆందోళన పర్వంలో ఇవాళ పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో జనసేనాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. జగన్ […]

త్రీ క్యాపిటల్స్ కాదు.. త్రిశంకు రాజధాని: పవన్ పంచ్ అదిరింది!
Follow us on

ఏపీకి మూడు రాజధానులు కాదు.. త్రిశంకు రాజధానిని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాజధాని కోసం జరుగుతున్న పోరాటాన్ని అరెస్టులతోను, గృహ నిర్బంధాలతోను ఆపలేరని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి భ్రమల్లోంచి ముఖ్యమంత్రి బయటికి రావాలని పవన్ కల్యాణ్ సూచించారు.

రెండ్రోజులుగా మరింత తీవ్ర రూపం దాల్చిన రాజధాని రైతుల ఆందోళన పర్వంలో ఇవాళ పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో జనసేనాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ అమరావతి ప్రాంతాన్ని మరో నందిగ్రామ్‌గా మార్చాలనుకుంటోందని పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటే ఉత్తరాంధ్ర వాసులు కూడా సంతృప్తికరంగా లేరని పవన్ కల్యాణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

రాయలసీమ వాసులకు సుదూరంగా రాజధానిని ఏర్పాటు చేసి, జగన్ ఏమి సాధించాలనుకుంటున్నారని జనసేనాని ప్రశ్నించారు. రాయలసీమకు దూరంగా, ఉత్తరాంధ్రకు ఉపయోగపడని, దక్షిణ కోస్తా వారికి అంతుచిక్కని రాజధానిని ఏర్పాటు చేస్తే ఎవరికి ఉపయోగమని పవన్ ప్రశ్నించారు. ఇలాంటి రాజధానిని ఏర్పాటు చేస్తే అది త్రిశంకు రాజధానే అవుతుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వెళ్ళిన ఉద్యోగులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని, వారిని రాజధాని తరలింపు పేరిట మరోచోటికి షిప్టు చేస్తే.. ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయని పవన్ కల్యాణ్ అంటున్నారు.