Pawan Kalyan: సీఎం కేసీఆర్, చంద్రబాబులకు పవన్ కల్యాణ్ విడివిడిగా ప్రత్యేక సందేశాలు..

|

Apr 20, 2021 | 2:16 PM

Pawan Kalyan: తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడివిడిగా ప్రత్యేక సందేశాలు పంపారు. ఈ మేరకు

Pawan Kalyan: సీఎం కేసీఆర్, చంద్రబాబులకు పవన్ కల్యాణ్ విడివిడిగా ప్రత్యేక సందేశాలు..
Pawan Kalyan(File Photo)
Follow us on

Pawan Kalyan: తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడివిడిగా ప్రత్యేక సందేశాలు పంపారు. ఈ మేరకు జనసేన రెండు వేర్వేరు ప్రకటనలను మంగళవారం విడుదల చేసింది. సోమవారం తెలంగాణ ముఖ్య‌మంత్రి కే. చంద్రశేఖర్‌ రావుకు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. దీనిపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యవంతులై ఎప్పటిలాగే ప్రజాసేవలో నిమగ్నం కావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నానన్నారు. అలాగే మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ కరోనాతో ఎయిమ్స్‌లో చేరినట్లు తెలిసిందని.. ఒక ఆర్థికవేత్తగా, దేశ ప్రధానిగా ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ఆయన త్వరగా కోలుకుని, ఆరోగ్యవంతులు కావాలని ప్రార్థిస్తున్నానంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఇదిలాఉంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కూడా క‌రోనా సోక‌డంతో ఆయ‌న ప్ర‌స్తుతం హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న‌ విష‌యం తెలిసిందే.

ఇదిలాఉంటే.. మరో ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, ప్రజా జీవితంలో చంద్రబాబు తనదైన ముద్ర వేసుకున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ఆరోగ్యవంతంగా ఉండాలని పవన్ ఆకాంక్షించారు.

Also Read: SBI Alerts: ఎస్‌బీఐ కస్టమర్లను హెచ్చరిక! ఈ విషయాలను మొబైల్‌ యాప్‌లో ఉంచుతున్నారా..? అయితే, మీ బ్యాంక్ ఖాతా ఖాళీ..!

PM Modi Meet: దేశంలో టీకా డ్రైవ్‌ సరళీకృతం.. ఇవాళ వ్యాక్సిన్స్ ఉత్పత్తిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ