జైలుకెళ్లిన వాళ్లే హ్యాపీగా తిరుగుతున్నారు.. నాకేంటి భయం..?

వాషింగ్టన్ డీసీ వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతున్న తానా వేడుకల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. విదేశాల్లో జరిగే తెలుగు మహాసభలకు ఎప్పుడూ దూరంగా ఉండే పవన్.. ఈసారి తానా సభలకు హాజరవడం విశేషం. తానా మహాసభల్లో న్యూ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు పవన్ కళ్యాన్. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలుకెళ్లి వచ్చిన వ్యక్తులే.. ఇప్పుడు హ్యాపీగా తిరుగుతున్నప్పుడు.. ఏ తప్పూ చేయని తాను ఎందుకు […]

జైలుకెళ్లిన వాళ్లే హ్యాపీగా తిరుగుతున్నారు.. నాకేంటి భయం..?

Edited By:

Updated on: Jul 06, 2019 | 1:42 PM

వాషింగ్టన్ డీసీ వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతున్న తానా వేడుకల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. విదేశాల్లో జరిగే తెలుగు మహాసభలకు ఎప్పుడూ దూరంగా ఉండే పవన్.. ఈసారి తానా సభలకు హాజరవడం విశేషం. తానా మహాసభల్లో న్యూ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు పవన్ కళ్యాన్.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలుకెళ్లి వచ్చిన వ్యక్తులే.. ఇప్పుడు హ్యాపీగా తిరుగుతున్నప్పుడు.. ఏ తప్పూ చేయని తాను ఎందుకు బాధపడాలని పరోక్షంగా విమర్శించారు. పాలకులు భయపెట్టి పాలిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని పవన్ హెచ్చరించారు.

జనసేన ఓటమి తర్వాత.. ఆ పరాజయాన్ని జీర్ణించుకోవడానికి తనకు కేవలం 15 నిమిషాలే పట్టిందన్న పవన్.. తాను డబ్బు పంచి ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం కష్టమని తనకు తెలుసన్న పవన్.. ఆ అపజయం తనకు మరింత బలాన్ని ఇచ్చిందన్నారు. మనుషుల్ని విడగొట్టే రాజకీయాలు చేయనన్న పవన్.. మనుషుల్ని కలిపే రాజకీయాలూ ఉంటాయన్నారు.