రాజకీయ ఒడిదుడుకులు తట్టుకోలేకే.. కోడెల మృతిపై జనసేనాని..

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిడులను తట్టుకోలేక ఆయన చనిపోవడం బాధాకరంగా ఉందని పవన్ చెప్పారు. కోడెలపై వచ్చిన ఆరోపణలు, విమర్శలపై ఆయన రాజకీయంగా పోరాటం జరిపి ఉంటే బాగుండేదని అన్నారు. కోడెల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ తరపున కోడెల మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. […]

రాజకీయ ఒడిదుడుకులు తట్టుకోలేకే.. కోడెల మృతిపై జనసేనాని..

Edited By:

Updated on: Sep 16, 2019 | 3:48 PM

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిడులను తట్టుకోలేక ఆయన చనిపోవడం బాధాకరంగా ఉందని పవన్ చెప్పారు. కోడెలపై వచ్చిన ఆరోపణలు, విమర్శలపై ఆయన రాజకీయంగా పోరాటం జరిపి ఉంటే బాగుండేదని అన్నారు. కోడెల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ తరపున కోడెల మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఒక వైద్య వృత్తిలో ఉన్న ఆయన రాజకీయవేత్తగా అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ్యునిగా, మంత్రిగా, ఏపీ స్పీకర్‌గా కోడెల ఎన్నో పదవులను చేపట్టారని పవన్ గుర్తుచేసుకున్నారు.