జగన్ పాలన సరిగ్గా చేస్తే..నేను వెళ్లి సినిమాలు చేస్కుంటా..

| Edited By: Pardhasaradhi Peri

Nov 04, 2019 | 3:45 PM

జనసేన లాంగ్ మార్చ్ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ప్రభుత్వం సరిగా పనిచేయనందునే ఇంతమందిలో ఆవేదన పెరిగిందన్నారు. ఇప్పటి వరకు 36 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారన్నారు. ఈ సభలో టీడీపీ నాయకులు సైతం పాల్లొన్నారు. ఈ సందర్భంగా పవన్ ప్రసంగంలోని మెయిన్ పాయింట్స్: వైసీపీ నేతలకు పాలన అంటే తెలుసా..? ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల కష్టాలపై ప్రభుత్వం స్పందించకుంటే నేనే వెళ్లి అమరావతి వీధుల్లో […]

జగన్ పాలన సరిగ్గా చేస్తే..నేను వెళ్లి సినిమాలు చేస్కుంటా..
Follow us on

జనసేన లాంగ్ మార్చ్ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ప్రభుత్వం సరిగా పనిచేయనందునే ఇంతమందిలో ఆవేదన పెరిగిందన్నారు. ఇప్పటి వరకు 36 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారన్నారు. ఈ సభలో టీడీపీ నాయకులు సైతం పాల్లొన్నారు. ఈ సందర్భంగా పవన్ ప్రసంగంలోని మెయిన్ పాయింట్స్:

    1. వైసీపీ నేతలకు పాలన అంటే తెలుసా..?
    2. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల కష్టాలపై ప్రభుత్వం స్పందించకుంటే నేనే వెళ్లి అమరావతి వీధుల్లో నడుస్తా..
    3. ప్రజలకు, కష్టాలకు మాత్రమే నేను దత్తపుత్రుడిని..మరెవరికీ కాదు
    4. ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది
    5. జగన్ అద్భుత పాలన అందిస్తే.. నేను వెళ్లి సినిమాలు చేసుకుంటా
    6. వైఎస్ఆర్సీపీ వాళ్లు నాకు శత్రువుల కాదు..ప్రజా సమస్యలపైనే నా పోరాటం
    7. కన్నబాబును రాజకీయాల్లోకి తీసుకొచ్చింది నాగబాబే..అతని బ్రతుకేంటో నాకు తెలుసు
    8. గాజువాకలో ఓడా, భీమవరంలో ఓడా.. కానీ నాకు పోరాడటం తెలుసు
    9. 2014 మార్చిలో పార్టీ పెట్టినప్పుడే.. 25 ఏళ్ల నా జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డా
    10. రాజకీయాలు అంటే అందరికీ సంపాదనేమో.. నాకు మాత్రం బాధ్యత
    11. భవన నిర్మాణ కార్మికుల కష్టం చాలా బలంగా నా మనసును తాకింది.
    12. ఆరు నెలలలోపే ప్రజలు ఎందుకు రోడ్ల మీదకు వస్తున్నారో ప్రభుత్వం ఆలోచించాలి
    13. నన్ను విమర్శించే నాయకులంతా ఓ పార్టీ పెట్టి చూడండి. పార్టీని నడపడం అంటే ఆషామాషీ కాదు. నేను డబ్బుతో పార్టీ నడిపే వ్యక్తిని కాదు..భావజాలంతో నడుపుతున్నా
    14. వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకునే అర్హత లేదు
    15. విజయసాయిరెడ్డి గారు నన్ను ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నేను ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వాడిని కాదని ఆయనకు చెప్పదలచుకున్నాను. నేను ఎన్నో చూసి వచ్చాను. పరిధి దాటితే తాట తీస్తాం.
    16. సూట్‌కేసు కంపెనీలు పెట్టే విజయసాయిరెడ్డి గారు కూడా నన్ను విమర్శిస్తే సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి ఈ దేశానికి వచ్చింది
    17. భవన నిర్మాణ కార్మికుల విషయంలో ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తున్నాను. ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి రూ. 50 వేలు పరిహారం చెల్లించాలి.చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి.