తెలంగాణ గవర్నర్ కి పవర్ స్టార్ పెద్ద థ్యాంక్స్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కి జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చారు. తెలంగాణ ప్రజలకోసం..

తెలంగాణ గవర్నర్ కి పవర్ స్టార్ పెద్ద థ్యాంక్స్

Updated on: Sep 02, 2020 | 8:00 PM

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కి జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చారు. తెలంగాణ ప్రజలకోసం మీరు చేస్తున్న కార్యక్రమాలు నిజంగా స్పూర్తిదాయకం మేడమ్ గవర్నర్ అంటూ పవన్ వినమ్రంగా కృతజ్ణతలు చెప్పారు. ఇలాఉండగా, పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షల సందేశాన్ని తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీరు మంచి ఆయురారోగ్యాలతో భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని తమిళసై ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఇవాళ అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖులు పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్ చెప్పినవారిలో ఉన్నారు.