Pawan Rana Movie : శరవేగంగా జరుపుకుంటున్న పవన్, రానా మూవీ.. సెట్ లో పవన్ ను చూసి అంతా షాక్

|

Feb 22, 2021 | 6:33 PM

పవన్ కళ్యాణ్ 25 ఏళ్ల కెరీర్ లో ఎన్నడూ లేనంతగా వరసగా సినిమాలను చేస్తున్నాడు.. అంతేకాదు తనకు రాజకీయాలు, ప్రజలు ముఖ్యమని.. అయితే సినిమాలు డబ్బులు కోసమే చేస్తున్నానంటూ ఓపెన్ గా చెప్పాడు పవన్...

Pawan Rana Movie : శరవేగంగా జరుపుకుంటున్న పవన్, రానా మూవీ.. సెట్ లో పవన్ ను చూసి అంతా షాక్
Follow us on

Pawan Rana Movie Shooting Update : ఎన్నికల సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు విరామం ప్రకటించి రాజకీయాల్లో బిజీ అయ్యాడు. తాజాగా తిరిగి హీరోగా వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు పవన్ కళ్యాణ్ 25 ఏళ్ల కెరీర్ లో ఎన్నడూ లేనంతగా వరసగా సినిమాలను చేస్తున్నాడు.. అంతేకాదు తనకు రాజకీయాలు, ప్రజలు ముఖ్యమని.. అయితే సినిమాలు డబ్బులు కోసమే చేస్తున్నానంటూ ఓపెన్ గా చెప్పాడు పవన్. ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా లో సినిమాల గురించి స్పందించలేదు.. ఎప్పుడూ ప్రజల సమస్యలనే ప్రస్తావించాడు..

మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనమ్ కోషియంకు రీమేక్.గా తెరకెక్కుతున్న సినిమాలో పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఐతే ఈ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ నటన పట్ల శ్రద్ధ తీసుకుని రీ టెక్ లు తీసుకుంటున్నాడట. ఈగో ఉన్న ఇద్దరు వ్యక్తుల కథతో ఈ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ కల్యాణ్.. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలోనూ.. అతడిని ఎదురించే వ్యక్తిగా రానా నటిస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఇందులో పవర్ స్టార్ రోల్ చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు.

ప్రతీ సీన్ ను బాగా రాకపోతే మరో షాట్ చేద్దామని పవన్ చెబుతుంటే అంతా షాక్ తింటున్నారు. ఓ సీన్ లో రానా గట్టి స్వరంతో పవన్ ను బెదిరించాల్సి ఉంటుంది. పవన్ పై అభిమానంతో కాస్త టోన్ డౌన్ చేసి రానా అంటే అది బాగా రాలేదని.. ‘గట్టిగా దబాయించు’ అని మరీ రీటేక్ చేయించాడట..ఇప్పుడు ఇదే విషయం ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తుంది.

పవన్ కళ్యణ్ ఒక రైటర్, డైరెక్టర్ కూడా. అప్పట్లో జానీ సినిమాను స్వయంగా డైరెక్ట్ చేశాడు. చిరంజీవి సినిమాలోని కొన్ని ఫైట్లను కూడా పవన్ డైరెక్ట్ చేశాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు.

Also Read

Breaking News: ముంబైలో ఎంపీ ఆత్మహత్య.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు

కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ఇక భారీగాప్రైవేట్ రంగ భాగస్వామ్యం, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ పాల్