
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలను కమిట్ అయిన విషయం తెలిసిందే. ఓ వైపు రాజకీయాలతో మరో వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నది పవన్. ఈ నేపథ్యంలో పూరిజగన్నాథ్ తో పవన్ మరోసారి చేయికలపనున్నాడని తెలుస్తుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు వచ్చాయి. తాజాగా మరో సారి పూరి పవన్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. నిజానికి పూరి మహేష్ బాబు తో ‘జనగణమన’ అనే సినిమా చేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది వీలుపడలేదు. దాంతో ఆ కథను ఇప్పడు పవన్ దగ్గరకు తీసుకువచ్చాడు పూరి. అవినీతి భారతంపై సాగే ఈ కథలో మంచి దేశ భక్తి ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే ఈ సినిమాను పవన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో పూరి ఉన్నటు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అవన్ని కూడా పూర్తి అయితే తప్ప కొత్త సినిమాను మొదలు పెట్టలేదు. అంటే పూరి.. పవన్ ల కాంబో మూవీ పట్టాలెక్కాలంటే 2022 వరకు వెయిట్ చేయాల్సిందే.