లాక్‌డౌన్‌ సమయంలో జనం ఆ బిస్కెట్లనే ఎక్కువగా తిన్నారంట..

లాక్‌డౌన్‌ సమయంలో తినుబండరాల కంపెనీలకు మాత్రం భారీ లాభాలను తెచ్చిపెట్టిందట. పార్లే జీ బిస్కెట్ కంపెనీ రికార్డుస్థాయిలో అమ్మకాలు సాగించింది.

లాక్‌డౌన్‌ సమయంలో జనం ఆ బిస్కెట్లనే ఎక్కువగా తిన్నారంట..

Edited By:

Updated on: Jun 10, 2020 | 3:12 PM

రోనా లాక్‌డౌన్‌తో అన్ని రంగాలు ఆర్థికంగా డీలాపడ్డాయి. దీంతో కొన్ని సంస్థలు మూతపడ్డాయి. కానీ తినుబండరాల కంపెనీలకు మాత్రం భారీ లాభాలను తెచ్చిపెట్టిందట. అందులో పార్లే జీ బిస్కెట్ కంపెనీ రికార్డుస్థాయిలో అమ్మకాలు సాగించింది.
కరోనా కష్టకాలంలో జనానికి ఎక్కువ రుచినిచ్చింది పార్లే – జీ బిస్కెట్లేనట. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా చాలా వ్యాపారాలు దెబ్బతింటే.. నిత్యావసర సరుకులకు మాత్రం బాగా గిరాకీ పెరిగింది. లాక్‌డౌన్‌ ముందు వరకు కష్టాల్లో ఉన్న పార్లే –జీ బిస్కెట్ల కంపెనీ ఇప్పుడు అమ్మకాలతో జోరందుకుంది. ఈ కరోనా కష్టకాలంలో ఎక్కువ మంది పార్లే – జీ బిస్కెట్లనే కొన్నారు. దీంతో 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అమ్మకాల్లో వృద్ధి సాధించిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంతో దాదాపు మార్కెట్‌ షేర్‌‌ 5 శాతానికి విస్తరించిందని తెలిపారు. ఇక తక్కువ ధరలో బిస్కెట్స్ వస్తుండడంతో లాక్ డౌన్ సమయంతో స్వచ్చంధ సంస్థలు ప్రభుత్వాలు పార్లే బిస్కెట్లను కొని పంచడం వంటి సేవా కార్యక్రమాలతో వాటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఇండియాలో ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు ప్రజలు పార్లే – జీని సౌకర్యవంతమైన ఫుడ్‌గా భావిస్తున్నారని అందుకే డిమాండ్ పెరిగిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రజలు తమ బ్రాండ్‌పైన పెట్టుకున్న నమ్మకానికి పార్లే జీ సంస్థ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.