Olympics Medal Quality: వారానికే రంగు పోయిన ఒలింపిక్ పతకం.. అమెరికా స్కేటర్ వీడియో.
తాజాగా ఒలింపిక్ పతకంపై ఓ అథ్లెట్ పెట్టిన పోస్ట్ వివాదాస్పదమవుతోంది. పారిస్‌లో కాంస్యం సాధించిన అమెరికా స్కేటర్ నిజా హ్యూస్టన్.. వారానికే దాని రంగు పోయిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మేరకు పతకం తాజా ఫొటోను షేర్ చేస్తూ నాణ్యత గురించి ప్రశ్నించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో తాము బస చేసే స్పోర్ట్స్ విలేజ్‌లో వసతులు సరిగా లేవంటూ ఇప్పటికే చాలామంది అథ్లెట్లు అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.
తాజాగా ఒలింపిక్ పతకంపై ఓ అథ్లెట్ పెట్టిన పోస్ట్ వివాదాస్పదమవుతోంది. పారిస్‌లో కాంస్యం సాధించిన అమెరికా స్కేటర్ నిజా హ్యూస్టన్.. వారానికే దాని రంగు పోయిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మేరకు పతకం తాజా ఫొటోను షేర్ చేస్తూ నాణ్యత గురించి ప్రశ్నించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో తాము బస చేసే స్పోర్ట్స్ విలేజ్‌లో వసతులు సరిగా లేవంటూ ఇప్పటికే చాలామంది అథ్లెట్లు అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఒలింపిక్ పతకాలు కొత్తగా ఉన్నప్పుడు చాలా అద్భుతంగా కన్పించాయనీ కానీ దాన్ని తను వేసుకున్నాక చెమట తగిలి కొంత రంగు మారిపోయిందని అనుకున్నంత నాణ్యతగా లేవనీ నిజా హ్యూస్టన్ అన్నాడు. కాస్త గరుకుగా మారిపోయిందనీ ముందువైపు రూపు మారిందనీ ఈ పతకాల నాణ్యతను మరింత పెంచితే బాగుంటుందనీ, పతకాన్ని చూస్తుంటే ఏదో యుద్ధానికి వెళ్లి వచ్చినట్లుగా అనిపిస్తోందని హ్యూస్టన్ తెలిపాడు. రంగు మారిన పతకం ఫొటోను షేర్ చేశాడు. గతవారం జరిగిన స్ట్రీట్ స్కేట్‌బోర్డింగ్‌లో ఈ స్కేటర్ కాంస్య పతకం నెగ్గాడు. దీనిపై పారిస్ ఒలింపిక్స్ అధికార ప్రతినిధి స్పందించారు. సోషల్ మీడియా ద్వారా విషయాన్ని తెలుసుకున్నామన్నారు. దీనిపై యాక్షన్ తీసుకున్నామనీ డ్యామేజ్ అయిన మెడల్స్ స్థానంలో కొత్త వాటిని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం: Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.