‘రఫేల్ బూచి’, చైనా సాయం కోరిన పాకిస్తాన్

| Edited By: Pardhasaradhi Peri

Nov 03, 2020 | 7:57 PM

ఫ్రాన్స్ నుంచి అత్యాధునిక రఫేల్ యుధ్ధ విమానాలు ఇండియాకు చేరడంతో పాకిస్తాన్ భయంతో వణికిపోతోంది. 5 రఫేల్ విమానాలు గత జులై 29 న అంబాలా వైమానిక స్థావరానికి చేరుకోగా వీటిని భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. మరో మూడు విమానాలు కూడా త్వరలో భారత్ చేరనున్నాయి. దీంతో పాకిస్తాన్ ఆందోళన చెంది సాయం కోసం ఛైనాను శరణు జొచ్చినట్టు తెలుస్తోంది. అత్యవసరంగా 30కి పైగా జె-10 (సీఈ) ఫైటర్లను, మిసైళ్లను చైనా నుంచి కొనుగోలు చేయనుందని  […]

రఫేల్ బూచి, చైనా సాయం కోరిన పాకిస్తాన్
Follow us on

ఫ్రాన్స్ నుంచి అత్యాధునిక రఫేల్ యుధ్ధ విమానాలు ఇండియాకు చేరడంతో పాకిస్తాన్ భయంతో వణికిపోతోంది. 5 రఫేల్ విమానాలు గత జులై 29 న అంబాలా వైమానిక స్థావరానికి చేరుకోగా వీటిని భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. మరో మూడు విమానాలు కూడా త్వరలో భారత్ చేరనున్నాయి. దీంతో పాకిస్తాన్ ఆందోళన చెంది సాయం కోసం ఛైనాను శరణు జొచ్చినట్టు తెలుస్తోంది. అత్యవసరంగా 30కి పైగా జె-10 (సీఈ) ఫైటర్లను, మిసైళ్లను చైనా నుంచి కొనుగోలు చేయనుందని  సమాచారం.   పాకిస్థాన్ నుంచి ఓ బృందం ఇటీవల చైనాను సందర్శించి ఈ కొనుగోలు వ్యవహారాన్ని ఖరారు చేసుకుందని తెలుస్తోంది. అసలు 50 విమానాల కోసం వీరు సంప్రదింపులు జరిపారని, అయితే అత్యవసరంగా 30 విమానాలు వస్తే చాలునని వారు కోరినట్టు చెబుతున్నారు. ఇప్పటికే భారత్ తన వైమానిక సత్తాను చాటుకుంది.