నోరుజారిన పాక్ ప్రధాని.. అప్పుడు నర్సులను చూస్తే నాకు..!

ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. మరోసారి నోరుజారారు. నెట్టింట్లో ఆయనపై హెవీ ట్రోలింగ్ జరుగుతోంది. కరాచీలోని ఓ ఆసుపత్రిలో ప్రసంగించిన ఇమ్రాన్.. తాను ఒకప్పుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సందర్భం గురించి ప్రస్తావించారు. “2013 ఎన్నికల ప్రచారంలో నేను వేదికపై నుండి పడిపోయిన తరువాత నేను షౌకత్ ఖానుమ్ ఆసుపత్రిలో అడుగుపెట్టినప్పుడు, నేను గాయాల కారణంగా తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నాను. కానీ డాక్టర్ అసిమ్ నాకు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు, నా బాధలన్నీ పోయాయి. ఆ […]

నోరుజారిన పాక్ ప్రధాని.. అప్పుడు నర్సులను చూస్తే నాకు..!

Edited By:

Updated on: Jan 28, 2020 | 7:46 PM

ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. మరోసారి నోరుజారారు. నెట్టింట్లో ఆయనపై హెవీ ట్రోలింగ్ జరుగుతోంది. కరాచీలోని ఓ ఆసుపత్రిలో ప్రసంగించిన ఇమ్రాన్.. తాను ఒకప్పుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సందర్భం గురించి ప్రస్తావించారు.

“2013 ఎన్నికల ప్రచారంలో నేను వేదికపై నుండి పడిపోయిన తరువాత నేను షౌకత్ ఖానుమ్ ఆసుపత్రిలో అడుగుపెట్టినప్పుడు, నేను గాయాల కారణంగా తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నాను. కానీ డాక్టర్ అసిమ్ నాకు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు, నా బాధలన్నీ పోయాయి. ఆ సమయంలో నర్సులు అప్సరసల్లా కనిపించారు” అని ఇమ్రాన్ తెలిపారు. తరువాత ఆసుపత్రి ఆవరణలో నేనో టీవీ ఇంటర్వ్యూ ఇచ్చాను. అయితే అప్పుడు ఏమన్నానో నాకు పెద్దగా గుర్తులేదు’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఇమ్రాన్‌ను ఓ రేంజ్‌లో ఆటాడుకుంటున్నారు.

[svt-event date=”28/01/2020,7:08PM” class=”svt-cd-green” ]

Loading...
Unable to load recommendations.
Follow Us