
న్యూఢిల్లీ : సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి స్వచ్ఛంద సంస్థ మాటున ఢిల్లీ, హర్యానా ప్రాంతాల్లో ఉగ్రవాద స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసిన ముగ్గురు పాకిస్థానీలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఛార్జిషీట్ వేసింది. పాకిస్థాన్ దేశానికి చెందిన ముహమ్మద్ సల్మాన్ (ఢిల్లీ), ముహమ్మద్ సలీం (రాజస్థాన్), ముహ్మద్ కమ్రాన్ (పాకిస్థాన్)లపై ఎన్ఐఏ కేసు వేసింది. ఫలా ఇ ఇన్సానియత్ ఫౌండేషన్ పేరిట ఉగ్రవాద సంస్థ నాయకుడు హాఫిజ్ సయీద్, అతని అనుచరుడు షాహిద్ మహమూద్ లు 2012లో ఢిల్లీ, హర్యానా కేంద్రాలుగా ఉగ్రవాద స్లీపర్ సెల్స్ ను ఏర్పాటు చేశారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. మసీదులు, మదర్సాల నిర్మాణం, పేద ముస్లిమ్ యువతుల వివాహాలకు సాయం, రోగులకు వైద్యసాయం పేరిట వారు పెద్దఎత్తున నిధులను పాకిస్థాన్, దుబాయ్ దేశాల నుంచి హవాలా మార్గంలో తీసుకువచ్చారని వెల్లడైంది. ఈ నిధులతో ఉట్వారాలో ఖుల్ఫా ఏ రషీదీన్ మసీదు నిర్మించి పాల్వాల్ లో పలువురు ముస్లిమ్ యువతుల వివాహాలు జరిపించారని వెల్లడైంది.