భారత్‌పై పాక్ అభ్యంతరకర వ్యాఖ్యలు

|

May 28, 2020 | 9:30 AM

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం తీసుకుంటున్న దురహంకారపూరిత విస్తరణ విధానాల వల్ల పొరుగు దేశాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. భారత్‌ తనతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలకు ముప్పుగా మారిందని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. పౌరసత్వ చట్టం వల్ల బంగ్లాదేశ్‌కు.., నేపాల్, చైనాలతో సరిహద్దు వివాదాలు..ఇలాంటి వాటితో తమ దేశానికి భారత్‌ ముప్పుగా మారిందన్నారు. ఇదిలావుంటే… ఓ వైపు నేపాల్ ప్రధానిని ఎగదోసినా చైనా.. తాజాగా పాకిస్తాన్ ప్రధానితో ఈ […]

భారత్‌పై పాక్ అభ్యంతరకర వ్యాఖ్యలు
Follow us on

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం తీసుకుంటున్న దురహంకారపూరిత విస్తరణ విధానాల వల్ల పొరుగు దేశాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. భారత్‌ తనతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలకు ముప్పుగా మారిందని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. పౌరసత్వ చట్టం వల్ల బంగ్లాదేశ్‌కు.., నేపాల్, చైనాలతో సరిహద్దు వివాదాలు..ఇలాంటి వాటితో తమ దేశానికి భారత్‌ ముప్పుగా మారిందన్నారు. ఇదిలావుంటే… ఓ వైపు నేపాల్ ప్రధానిని ఎగదోసినా చైనా.. తాజాగా పాకిస్తాన్ ప్రధానితో ఈ ట్వీట్లు చేయిస్తోందని భారత్ భావిస్తోంది.