Padmashree awardee: సుర‌భి నాట‌క క‌ళాకారుడు బాబ్జి ఇకలేరు, అనారోగ్యంతో కన్నుమూత

సురభి బాబ్జిగా గుర్తింపు పొందిన సురభి నాటక కళాకారుడు నాగేశ్వర రావు కన్నుమూశారు. ఆయనకు వయసు 76 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన ..

Padmashree awardee: సుర‌భి నాట‌క క‌ళాకారుడు బాబ్జి ఇకలేరు, అనారోగ్యంతో కన్నుమూత
Surabhi Babji Died

Updated on: Jun 09, 2022 | 9:25 PM

సురభి బాబ్జిగా గుర్తింపు పొందిన సురభి నాటక కళాకారుడు నాగేశ్వర రావు కన్నుమూశారు. ఆయనకు వయసు 76 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన గురువారం హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో ఉన్న తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. నాట‌క రంగంలో తొలి ప‌ద్మ‌శ్రీ అవార్డును ద‌క్కించుకున్న క‌ళాకారుడిగా సుర‌భి బాబ్జికి మంచి గుర్తింపు ఉంది.

ఈయన నటించిన సురభి నాటకంతో మంచి గుర్తింపు రావడంతో ఆ పేరుతోనే స్థిరపడిపోయారు. పేరు నాగేశ్వ‌ర‌రావు అయినా సురభి నాట‌క క‌ళ‌తో ఆయ‌న పేరు సుర‌భి బాబ్జిగా మారిపోయింది. ఆయన మృతిపట్ల పలువురు సినీ, నాటకరంగ కళాకారులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.