వంద జవాన్ పోస్ట్‌లు.. 2లక్షల మంది మహిళలు దరఖాస్తు

| Edited By:

Jul 04, 2019 | 10:08 AM

రక్షణ దళాల్లోకి మహిళ ప్రవేశానికి కేంద్రం ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్‌లో వంద జవాన్ల పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఆ పోస్టులకు రెండు లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని చూసి ఆర్మీ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. వీరందరికీ ఈ నెలాఖరున బెల్గామ్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. కాగా మహిళలను రక్షణ రంగాల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన తరువాత తొలిసారి ఆరుగురు మహిళలు భారత […]

వంద జవాన్ పోస్ట్‌లు.. 2లక్షల మంది మహిళలు దరఖాస్తు
Follow us on

రక్షణ దళాల్లోకి మహిళ ప్రవేశానికి కేంద్రం ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్‌లో వంద జవాన్ల పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఆ పోస్టులకు రెండు లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని చూసి ఆర్మీ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. వీరందరికీ ఈ నెలాఖరున బెల్గామ్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. కాగా మహిళలను రక్షణ రంగాల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన తరువాత తొలిసారి ఆరుగురు మహిళలు భారత వాయుసేనలో చేరి.. ప్రస్తుతం పైలెట్‌లుగా శిక్షణ పొందుతున్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు మహిళా ప్రొవొస్ట్ యూనిట్‌లను పెంచేందుకు భారత సైన్యం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో ఇద్దరు అధికారులు, ముగ్గురు జూనియర్ కమిషన్ అధికారులు, 40మంది జవాన్లు ఉండనున్నారు. ఇందుకు సంబంధించిన తుది అనుమతులు రావాల్సి ఉందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.