కోవిద్ 19 ఎఫెక్ట్: న్యూయార్క్ లో.. ప్రతి 100 మందిలో.. ఒకరికి కరోనా పాజిటివ్..

| Edited By:

Apr 14, 2020 | 1:37 PM

కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలమయింది. ఎత్తైన భవనాలు. లక్షల కోట్ల స్టామినా ఉన్న కంపెనీలు, అత్యధిక జనసాంద్రత, టెక్నాలజీలో దూసుకుపోయే న్యూయార్క్... ప్రపంచంలో ఎంతో మందికి కలల ప్రపంచం

కోవిద్ 19 ఎఫెక్ట్: న్యూయార్క్ లో.. ప్రతి 100 మందిలో.. ఒకరికి కరోనా పాజిటివ్..
Follow us on

కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలమయింది. ఎత్తైన భవనాలు. లక్షల కోట్ల స్టామినా ఉన్న కంపెనీలు, అత్యధిక జనసాంద్రత, టెక్నాలజీలో దూసుకుపోయే న్యూయార్క్… ప్రపంచంలో ఎంతో మందికి కలల ప్రపంచం. అలాంటి నగరం… కరోనా వైరస్ బారినపడి కకావికలమవుతోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే… ఆస్పత్రుల మార్చురీలన్నీ మృతదేహాలతో నిండిపోవడంతో… తాజాగా చనిపోతున్న వారిని ఎక్కడ ఉంచాలో కూడా డాక్టర్లకు అంతుబట్టడంలేదు.

కాగా.. ఇప్పుడు ప్రపంచంలో మరే దేశంలో నమోదు కానన్ని కేసులు… ఒక్క న్యూయార్క్ నగరంలోనే ఉన్నాయి. అమెరికాలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 40 శాతం ఒక్క  న్యూయార్క్ లోనే నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో 586941 కేసులు ఉండగా… న్యూయార్క్ లో 195655 ఉన్నాయి. అమెరికాలో మృతుల సంఖ్య 23640గా ఉండగా… న్యూయార్క్ లో 10056 ఉన్నాయి. 2019 లెక్కల ప్రకారం న్యూయార్క్ జనభా 1.94 కోట్లు. సోమవారం లెక్కల ప్రకారం… న్యూయార్క్ లోని ప్రతీ 100 మందిలో ఒకరికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. స్పెయిన్ లాంటి అత్యధిక కేసులున్న దేశంలో కూడా ఇంత తీవ్రమైన పరిస్థితి లేదు.