వర్శిటీ పీజీ ప్రవేశ పరీక్షలు వాయిదా..

|

Nov 02, 2020 | 7:36 PM

తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్శిటీల్లో పీజీ ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇందులో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూ వర్సిటీల్లో పీజీతోపాటు పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలను సైతం..

వర్శిటీ పీజీ ప్రవేశ పరీక్షలు వాయిదా..
Follow us on

Common PG Entrance Exam : తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్శిటీల్లో పీజీ ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇందులో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూ వర్సిటీల్లో పీజీతోపాటు పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలను సైతం నిర్వహించనున్న కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష (CPGET-2020) వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 6 నుంచి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా యూనివర్సిటీ వర్గాలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. డిసెంబర్‌ 1 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ మేరకు దరఖాస్తు గడువును సైతం మరోమారు పొడిగించినట్లుగా వెల్లడించారు. లేట్ ఫీతో ఈ నెల 21 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఓయూ యూనివర్సిటీ కన్వీనర్‌ సూచించారు. కామన్‌ పీజీ ప్రవేశ్‌ పరీక్షను గతేడాది మాదిరి ఈ సారి కూడా ఉస్మానియా యూనివర్సిటీయే నిర్వహిస్తున్నది.

ఇదిలావుంటే…  ఇటీవల నగరంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఓయూ పరిధిలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన పరీక్షలను ఈ నెల 6 నుంచి నిర్వహించనున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా ఈ నెల 10 నుంచి ఎంబీఏ సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.