Online marriage: ఆన్‌లైన్‌లో నిఖా… కరోనా ప్రభావం మాములుగా లేదుగా!

|

Mar 16, 2020 | 2:47 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మనుషుల జీవితాల్లో విపరీతమైన మార్పులకు కారణమవుతోంది. మాములుగా జరిగే చాలా పనులను ఇతరత్రా మార్గాల ద్వారా చేసుకోవాల్సిన దుస్థితి కలిగిస్తోంది కరోనా. ఇందుకు తాజా ఉదాహరణ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఆన్‌లైన్ వివాహం. అదే నిఖా.

Online marriage: ఆన్‌లైన్‌లో నిఖా... కరోనా ప్రభావం మాములుగా లేదుగా!
Follow us on

Online marriage held in Kottagudem distrct: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మనుషుల జీవితాల్లో విపరీతమైన మార్పులకు కారణమవుతోంది. మాములుగా జరిగే చాలా పనులను ఇతరత్రా మార్గాల ద్వారా చేసుకోవాల్సిన దుస్థితి కలిగిస్తోంది కరోనా. ఇందుకు తాజా ఉదాహరణ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఆన్‌లైన్ వివాహం. అదే నిఖా.

ఆన్‌లైన్ పెళ్ళేంటా అనుకుంటున్నా.. ఇది నిజం. వరుడు విదేశాల నుంచి రావాల్సి వుండడం.. వధువు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వుండిపోవడం.. ముహూర్తం దగ్గర పడడంతో పెద్దలు ఇలా డిసైడ్ చేశారు. విదేశాల నుంచి ప్రయాణాలను నియంత్రించిన నేపథ్యంలో ఆదివారం రాత్రి జరగాల్సిన నిఖా వాయిదా పడే పరిస్థితి ఏర్పడింది. దుబాయ్‌లో వున్న వరుడు రావడానికి ఇబ్బంది.. అదే సమయంలో ఒక వేళ వచ్చినా.. క్వారంటైన్ ఆసుపత్రిలో నెగెటివ్‌గా తేలితేనే వివాహానికి హాజరయ్యే పరిస్థితి. అందుకే వరుడు అక్కడే దుబాయ్‌లో వుండిపోయాడు.

కరోనా ఎఫెక్టుతో వరుడు రాలేకపోవడంతో మరో ప్రత్యామ్నాయం ఆలోచించారు రెండు కుటుంబాల పెద్దలు. ముస్లిం సంప్రదాయంలో కుబూల్ పదానికి వున్న ఇంపార్టెన్స్ దృష్ట్యా.. దాన్ని వినియోగించుకుని ఆదివారం రాత్రి ముహూర్తానికే ఆన్‌లైన్‌లోనే నిఖా నిర్వహించాలని తలపెట్టి మత పెద్దలను సంప్రదించారు. వారు కూడా అంగీకరించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో వున్న వధువుకు, దుబాయ్‌లో వరునితో ఆన్‌లైన్‌లో నిఖా తంతును ముగించారు.