తెలంగాణలో డిజిటల్ తరగతులు వాయిదా..

|

Aug 17, 2020 | 12:49 AM

తెలంగాణలో రేపటి నుంచి దూరదర్శన్, టీ-శాట్ ఛానళ్లలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ డిజిటల్ తరగతుల నిర్వహణను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

తెలంగాణలో డిజిటల్ తరగతులు వాయిదా..
Follow us on

Online Classes Postponed: తెలంగాణలో ఈరోజు నుంచి దూరదర్శన్, టీ-శాట్ ఛానళ్లలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ డిజిటల్ తరగతుల నిర్వహణను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగానే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే డిజిటల్ తరగతులు ప్రారంభించే కొత్త తేదీలను ప్రకటిస్తామని ఇంటర్మీడియట్ సెక్రటరీ సయ్యద్ ఉమర్ జలీల్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

కాగా, ఆగష్టు 17వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్, డిజిటల్ క్లాసులు, అలాగే ఈ నెల 20 నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు.. సెప్టెంబర్ 1 నుంచి 3-5 తరగతులకు డిజిటల్ తరగతులు దూరదర్శన్, టీ-శాట్ ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.

Also Read:

‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ధోని..

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..

గ్యాస్ బుక్ చేసుకుంటున్నారా.! అయితే మీకో అదిరిపోయే ఆఫర్..

జగన్ చుట్టూ పెద్ద కుట్ర జరుగుతున్నట్లుంది: హీరో రామ్