ఓ సీఆర్‌పీఎఫ్ జవాను క్యాంపులో కాల్పులు జరిపాడు. పశ్చిమ బెంగాల్‌లోని భగ్‌నన్‌లో ఈ ఘటన జరిగింది. క్యాంపులో ఉన్న తోటి సిబ్బందిపై జరిపిన కాల్పుల్లో ఓ జవాను మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. లక్ష్మీకాంత్ బర్మన్ అనే జవాను తన దగ్గర ఉన్న గన్‌తో సుమారు 18 రౌండ్లు కాల్పులు జరిపాడు. అతను హౌరాలో పోలింగ్ డ్యూటీలో ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల్లో మరణించిన జవాన్‌ను బోలేనాథ్ దాస్‌గా గుర్తించారు. కాల్పులు జరిపిన జవాను బర్మన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు కాల్పులు జరిపాడన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో హౌరా నియోజకవర్గంలో సెంట్రల్ బలగాలను మోహరించారు. మే 6 న జరిగే ఆరవ విడత ఎన్నికలలో ఇక్కడ పొలింగ్ జరుగనుంది. ఫలితాలు మే 23 న ప్రకటించబడతాయి.