Jobs Recruitment : రాబోయే రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ…. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

| Edited By:

Jan 04, 2021 | 11:59 AM

రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో లక్ష ఉద్యోగాలను భర్తీ చేయనున్నదని, ఇందుకోసం యువత సిద్ధం కావాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు....

Jobs Recruitment : రాబోయే రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ.... ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌
చిన్న సవరణ చేస్తే చాలు.. పని అయిపోతుందని, గతంలోనే ఈ మార్పు చేయాలని తాను సూచించిన.. పట్టించుకోలేదంటున్నారు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్.
Follow us on

Jobs Recruitment : రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో లక్ష ఉద్యోగాలను భర్తీ చేయనున్నదని, ఇందుకోసం యువత సిద్ధం కావాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. కరీంనగర్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఆయన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, నగర మేయర్‌ వై సునీల్‌రావుతో కలిసి కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో గ్రంథాలయం అంటే షాపింగ్‌ కాంప్లెక్స్‌కు నిలయంగా ఉండేదని, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా రవీందర్‌రెడ్డి విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చారన్నారు. కేంద్ర గ్రంథాలయంతోపాటు మండలాలకు సంబంధించిన గ్రంథాలయాల ఏర్పా టు, అభివృద్ధి కోసం సుమారు రూ.3 కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులను కేటాయించడం హర్షణీయమన్నారు.

 

కలెక్టర్‌ కె శశాంక సహకారంతో రూ.18 లక్షల నిధులతో అధునాతన ఫర్నిచర్‌, పుస్తకాలను నిరుద్యోగ యువత, పాఠకుల కోసం అందుబాటులో ఉంచిన చైర్మన్‌ను అభినందించారు. అనంతరం కలెక్టర్‌, ప్రజాప్రతినిధులతో కలిసి చిల్డ్రన్స్‌ లైబ్రరీ, రీడింగ్‌ హాళ్లను పరిశీలించారు. గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.

 

Also Read:

Drunk and Drive: మందు బాబులకు ఝలక్ ఇస్తున్న సైబరాబాద్ పోలీసులు.. వారం రోజుల్లో3571 కేసులు నమోదు..

Telangana Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 238 వైరస్ పాజిటివ్ కేసులు..మరణాలు, యాక్టీవ్ కేసుల వివరాల ఇలా ఉన్నాయి