ఆ వృద్ధులకు చెట్టుమీదే ఇళ్లు..! తోడుగా కుక్క,పిల్లి !

| Edited By: Srinu

Nov 22, 2019 | 8:38 PM

గ్రామాలు, పంట పొలాలపై పడి గజరాజులు సృష్టించే బీభత్సం అంతాఇంతా కాదు.. ఒక్కసారి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగులు…ఇళ్లు, పొలాలపై పడి విధ్వంసం చేస్తాయి. అడ్డొచ్చిన అమాయకులను సైతం తమ పాదాలతో తొక్కి చంపేసిన సంఘటనలు లేకపోలేదు. అస్సోంలో కూడా ఓ ఏనుగుల మంద గ్రామాలపై పడి తమ ప్రతాపం చూపించాయి. ఉదల్గుడీ జిల్లాలో ఇటీవల విరుచుకుపడిన ఏనుగుల గుంపు. అనేక ఇళ్లను నేలమట్టం చేశాయి. ఏనుగుల దాడిలో అనేక మంది ప్రజలు తమ నివాసాలు కోల్పోవాల్సి వచ్చింది. […]

ఆ వృద్ధులకు చెట్టుమీదే ఇళ్లు..! తోడుగా కుక్క,పిల్లి !
Follow us on

గ్రామాలు, పంట పొలాలపై పడి గజరాజులు సృష్టించే బీభత్సం అంతాఇంతా కాదు.. ఒక్కసారి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగులు…ఇళ్లు, పొలాలపై పడి విధ్వంసం చేస్తాయి. అడ్డొచ్చిన అమాయకులను సైతం తమ పాదాలతో తొక్కి చంపేసిన సంఘటనలు లేకపోలేదు. అస్సోంలో కూడా ఓ ఏనుగుల మంద గ్రామాలపై పడి తమ ప్రతాపం చూపించాయి. ఉదల్గుడీ జిల్లాలో ఇటీవల విరుచుకుపడిన ఏనుగుల గుంపు. అనేక ఇళ్లను నేలమట్టం చేశాయి. ఏనుగుల దాడిలో అనేక మంది ప్రజలు తమ నివాసాలు కోల్పోవాల్సి వచ్చింది. అలా గజరాజుల ఘీంకారానికి సర్వం కోల్పోయిన ఓ వృద్ధ దంపతులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు గానూ ప్రతిరోజూ ఓ సాహసమే చేస్తున్నారు. ఉండేందుకు తమకు సరైన గూడు లేకపోవడంతో..ఓ చెట్టుపైనే ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు.. వారితో పాటు ఓ కుక్క, పిల్లి, కోళ్లు కూడా అక్కడే ఉంటున్నాయి. అసలే వృద్ధులు, కనీసం నడవడానికి కూడా శక్తి చాలని వారిద్దరు రోజూవారి అవసరాల కోసం శక్తి కూడదీసుకుని చెట్టు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. దాతలేవరైనా మందుకు వచ్చి ఆ వృద్ధ దంపతులను ఆదుకుంటారని ఆశగా ఎదురుచూస్తున్నారు.