#COVID19 విదేశాల నుంచి వచ్చిన వారికి కేసీఆర్ బంపర్ ఆఫర్

|

Mar 21, 2020 | 3:42 PM

కరోనాపై ప్రకటించిన యుద్దంలో తెలంగాణ ముఖ్యమంత్రి విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. అది కూడా చేతులెత్తి మొక్కి మరీ ఆఫర్ ప్రకటించారు. యావత్ ప్రపంచం కరోనా భయంతో వణికిపోతున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. విదేశీ యాత్రికులకు ఈ అఫర్ ఇచ్చారు.

#COVID19 విదేశాల నుంచి వచ్చిన వారికి కేసీఆర్ బంపర్ ఆఫర్
Follow us on

KCR has given bumper offer to foreign returned persons: కరోనాపై ప్రకటించిన యుద్దంలో తెలంగాణ ముఖ్యమంత్రి విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. అది కూడా చేతులెత్తి మొక్కి మరీ ఆఫర్ ప్రకటించారు. యావత్ ప్రపంచం కరోనా భయంతో వణికిపోతున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. విదేశీ యాత్రికులకు ఈ అఫర్ ఇచ్చారు.

తెలంగాణలో ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే.. అవన్నీ విదేశాల నుంచి వచ్చిన వారివి.. లేదా అలా వచ్చిన వారితో వున్న వారికి వైరస్ సోకినట్లు తేలింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఫారిన్ నుంచి వచ్చిన వారిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. ఇప్పటి వరకు 20 వేల మంది ఇటీవల కాలంలో విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించారు. వారిలో 11 వేల మందిని ప్రభుత్వ సిబ్బంది అదుపులోకి తీసుకోవడమో.. లేక హోం క్వారంటైన్ చేయించడమో చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శనివారం మీడియా ముందుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్… విదేశీయానం చేసిన వచ్చిన వారికి ఈ ఆఫర్ ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా ప్రభుత్వ వైద్య సిబ్బందినో.. లేక పోలీసులను కలుసుకుని తమ ప్రయాణ వివరాలు తెలియజేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎవరినీ అరెస్టు చేయరని, వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వారిని క్వారెంటైన్ సెంటర్లకు తరలించడమో… తీవ్రత అంతగా లేకపోతే.. ఇళ్ళకే పరిమితం కావాలని సూచించడమో చేస్తారని కేసీఆర్ తెలిపారు.

విదేశీయానం చేసిన వారు.. తమ కుటుంబ సభ్యుల కోసం, సమాజం కోసం… స్వచ్ఛంగా ముందుకు రావాలన్నారు సీఎం. రెండు, మూడు వారాలు సామాజిక దూరం పాటిస్తే.. కరోనాపై విజయం సాధించ వచ్చని, అది చైనాలో నిరూపణ అయ్యిందని అంటున్నారు కేసీఆర్.