జబర్దస్త్‌ షోలో క్లాషెస్.. స్టేజ్ దిగి వెళ్లిపోయిన టీం లీడర్..

జబర్దస్త్ షోలో కామెడీని పండించడానికి.. అప్పుడప్పుడు కర్రలతో, బెత్తాలతో, రాళ్లతో కొట్టుకుంటూ ఉంటారు. ఆ కామెడీని చూసి జడ్జిలతో పాటు.. ఆడియెన్స్ కూడా కడుపు చెక్కలయ్యేలా నవ్వుతూ ఉంటారు. కానీ తాజాగా ఆ కామెడీ కాస్తా.. రియల్ ఫైట్‌లాగా మారింది. ఇప్పడు ఈ గొడవ కాస్తా అందరినీ..

జబర్దస్త్‌ షోలో క్లాషెస్.. స్టేజ్ దిగి వెళ్లిపోయిన టీం లీడర్..
TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 21, 2020 | 3:37 PM

జబర్దస్త్ షోలో కామెడీని పండించడానికి.. అప్పుడప్పుడు కర్రలతో, బెత్తాలతో, రాళ్లతో కొట్టుకుంటూ ఉంటారు. ఆ కామెడీని చూసి జడ్జ్‌లతో పాటు.. ఆడియెన్స్ కూడా కడుపు చెక్కలయ్యేలా నవ్వుతూ ఉంటారు. కానీ తాజాగా ఆ కామెడీ కాస్తా.. రియల్ ఫైట్‌లాగా మారింది. ఇప్పడు ఈ గొడవ కాస్తా అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ షోలో స్కిట్‌లో భాగంగా.. అప్పారావుని, భాస్కర్ కర్రతో గట్టిగా కొడతాడు. అయితే స్కిట్‌లో ఉన్నట్టుగానే కొడుతున్నాడన్న భావనలో భాస్కర్ ఉండగా.. అప్పారావుకి ఆ కర్ర దెబ్బలు గట్టిగా తగులుతాయి. దీంతో అప్పారావు ఒక రేంజ్‌లో ఫైర్ అవుతాడు. స్కిట్‌ని మధ్యలో ఆపేసి భాస్కర్‌తో గొడవ పడి, షర్ట్ విప్పేసి ఒంటిమీద వాతలను చూపిస్తాడు.

తాను కూడా ఓ టీం లీడరే అని తెలిసి కూడా నన్ను ఇలా కొడతావా అంటూ గొడవ పడి, స్కిట్ మధ్యలో ఆపేసి, స్టేజ్ దిగి వెళ్లిపోతాడు. ఈ ఊహించని సంఘటనతో ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ జడ్జ్‌లను, యాంకర్‌ని, టీం మెంబర్స్‌ని కూడా షాక్ అయ్యేలా చేసింది. జబర్దస్త్‌లో కొన్నిసార్లు ఈ రకమైన స్కిట్లలో కమెడియన్స్ బాధపడే అంశాలు జరిగినా అవి బయటకు చూపించరు. కానీ వచ్చే వారం ఎపిసోడ్ ప్రోమోలో భాస్కర్‌తో అప్పారావు గొడవ చూపించి షాక్ ఇచ్చారు. అయితే ఇది నిజంగా జరిగిందా? లేక స్కిట్‌లో భాగమా అనేది తెలియాలంటే వచ్చేవారం ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే. కానీ ఇది మాత్రం నిజంగానే జరిగితే.. షోలో కంటెస్టెంట్స్ మధ్య డిస్టన్స్ గురించి బయట వినిపించే వార్తలు నిజమేనన్న డౌట్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి.

Read More this also: 

కరోనాలో కనిపించే మరో రెండు కొత్త లక్షణాలు.. ఇవి ఉన్నవారు కోలుకోవడం కష్టమే

నిర్భయ దోషుల్ని ఉరితీసే తలారికి ఎంత డబ్బు ఇస్తారంటే..

 జబర్దస్త్ నుంచి బయటకు పంపించేస్తే.. నేను ఇది చేయడానికి సిద్ధం

అలెర్ట్: ఆ గ్రూపు రక్తం ఉన్నవారికి కరోనా ఎక్కువగా సోకుతుందట

కరోనా వచ్చిందనే భయంతో యువకుడు సూసైడ్

పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌కి మరో బ్యాడ్ న్యూస్

సిద్ధార్థ్‌ని త్వరగా వదిలించుకున్నా.. లేకుంటే నా లైఫ్ మరో సావిత్రిలా ఉండేది..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu