
పెందుర్తి: శిరోముండనం కేసులో నిందితుడైన నూతన్ నాయుడిపై మరో కేసు నమోదైంది. ఆగష్టు 29న ప్రముఖ వ్యక్తి పేరుతో తనకు ఫోన్ కాల్ చేసిన నూతన్ నాయుడు.. వైద్య పరీక్షల్లో అతడి భార్య రిపోర్టును మేనేజ్ చేసేందుకు యత్నించాడని డాక్టర్ సుజాత అనే మహిళ పెందుర్తి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఇక ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నూతన్ నాయుడుపై చీటింగ్ కేసు నమోదు చేశారు. (Another Case On Nuthan Naidu)
కాగా, శిరోముండనం కేసులో నూతన్ నాయుడు భార్యతో సహా ఏడుగురు నిందితులను పోలీసులు ఆగష్టు 29న అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నూతన నాయుడుపై రిటైర్డ్ ఐఎఎస్ పీవీ రమేష్ పేరుతో అధికారులకు ఫేక్ కాల్స్ చేస్తున్న విషయంలో కేసు నమోదు కాగా.. సీఐ సూరినాయుడు ఫిర్యాదుతో గాజువాకలో మరో కేసు నమోదైంది. ఇక కంచరపాలెంలో మరో బాధితుడి ఫిర్యాదుతో.. పోలీసులు నూతన్ నాయుడిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. దీనితో నూతన్ నాయుడుపై శిరోముండనం కేసు కాకుండా 4 పీఎస్‌లలో చీటింగ్ కేసులు నమోదయ్యాయి.
Also Read: రైల్వే ప్రయాణీకులకు తీపికబురు…