మాస్క్ ధరించకుండా బయటకొస్తే.. భారీ జరిమానా తప్పదు..

|

Jun 14, 2020 | 4:03 PM

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోయినా, సామాజిక దూరం పాటించకపోయినా భారీ జరిమానాలు విధించేందుకు సిద్దమైంది.

మాస్క్ ధరించకుండా బయటకొస్తే.. భారీ జరిమానా తప్పదు..
Follow us on

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోయినా, సామాజిక దూరం పాటించకపోయినా భారీ జరిమానాలు విధించేందుకు సిద్దమైంది. ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటికొచ్చిన ప్రతీసారి ఫేస్ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే మొదటిసారి రూ. 500 జరిమానా.. రెండోసారి దొరికితే రూ. 1000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అలాగే పబ్లిక్ ప్లేస్‌లలో ఉమ్మి వేసినా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఢిల్లీ సర్కార్ తెలియజేసింది.